Tuesday, April 22, 2025

చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. ఓ 20 మంది టీడీపీ ఎమ్మెల్యేలపై కేసుల నమోదు?

- Advertisement -

రాజకీయ ప్రయోజనాల విషయంలో చంద్రబాబు తర, తమ అన్న విభేదాలు చూడరు. ఈ విషయంలో సొంత వారిని సైతం అడ్డగోలుగా బుక్ చేయగల నేర్పరి చంద్రబాబు. ఈ విషయం చాలా సందర్భాల్లో వెలుగు చూసింది. తాజాగా ఆయన అదే ఆలోచనతో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఓ 20 మంది సొంత పార్టీ ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. తద్వారా కూటమి ప్రభుత్వంపై సానుకూల సంకేతాలు ప్రజల్లోకి పంపేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా ఓ 20 మంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి రోజురోజుకు వివాదాస్పదం అవుతోంది. అడ్డగోలు దోపిడీతో పాటు అవినీతికి పాల్పడుతుండడంతో ఫిర్యాదులు వస్తున్నాయి. అటువంటి వారిని పిలిచి పలుమార్లు హెచ్చరించారు చంద్రబాబు. అయినా వారి వైఖరిలో మార్పు రావడం లేదు. అధినేతను పట్టించుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదు. దీంతో వారి విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో తెలియక చంద్రబాబు తల పట్టుకుంటున్నారు.

మరోవైపు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సైతం ఓ రిపోర్టు చంద్రబాబు వద్దకు చేరినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఓ 20 మంది ఎమ్మెల్యేలు ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారని.. ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని నిఘా వర్గాలు ప్రధానమంత్రి కార్యాలయానికి నివేదించినట్లు తెలుస్తోంది. దీంతో పీఎంఓ అప్రమత్తమై.. ఏపీ సీఎం చంద్రబాబును సంప్రదించినట్లు సమాచారం.

కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలు దాటుతోంది. ఏడాది కాలం సమీపిస్తోంది. సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. అభివృద్ధి కనిపించడం లేదు. ఆపై ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అందుకే చంద్రబాబు అలెర్ట్ అయినట్లు సమాచారం. సొంత పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలపై కేసుల నమోదుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఉత్తరాంధ్రకు చెందిన ఓ నలుగురు.. గోదావరి జిల్లాలకు చెందిన ఆరుగురు.. కోస్తాంధ్రకు చెందిన మరో నలుగురు.. రాయలసీమ జిల్లాలకు చెందిన ఓ ఆరుగురు ఎమ్మెల్యేలపై కేసుల నమోదుకు నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే అటువంటి ఎమ్మెల్యేల ఆదేశాలు పాటించవద్దని పోలీస్, అధికారులకు ప్రత్యేక సమాచారం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడం ద్వారా కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత వచ్చేలా చూడాలన్నది చంద్రబాబు ప్లాన్. పైగా సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రజలను డైవర్షన్ చేయవచ్చని కూడా ఒక ఆలోచన. సో చంద్రబాబు పాచిక పారుతుందా? లేదా? అన్నది చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!