Sunday, March 16, 2025

కమ్మ సామాజిక వర్గంలో చేంజ్.. వైసీపీకి దగ్గరయ్యే ఛాన్స్!

- Advertisement -

ఈ ఎన్నికల్లో కూటమి గెలవడానికి అనేక కారణాలు ఉన్నాయి. బలమైన ఆకాంక్షలు పనిచేశాయి. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం అధికారంలోకి రావాలని ఎంతగానో పరితపించింది. ఈసారి అధికారంలోకి రాకుంటే సామాజిక వర్గ మనుగడ కష్టమని భావించింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మ సామాజిక వర్గం ఏకతాటిపైకి వచ్చింది. ఈసారి కాకపోతే ఇంకెప్పుడు అధికారంలోకి రాలేమని బలంగా నమ్మింది ఆ సామాజిక వర్గం. కూటమి కట్టేందుకు దోహదపడింది. పెద్ద ఎత్తున ఆర్థిక సాయం కూడా చేసింది. ఫలితంగా కూటమి అధికారంలోకి వచ్చింది. దానికి టిడిపి నేతృత్వం వహిస్తోంది. సీన్ కట్ చేస్తే కూటమిపాలన ఎనిమిది నెలలు పూర్తయింది. కానీ ఆ సామాజిక వర్గం సంతృప్తిగా లేదు.

ఏపీలో కూటమి ప్రభుత్వం నడుస్తోంది. జనసేనతో పాటు బిజెపి సైతం భాగస్వామ్యంగా ఉంది. మూడు పార్టీల మధ్య సమన్వయం అవసరం. ఇప్పుడు చంద్రబాబు చేస్తోంది అదే. కానీ ఈ నేపథ్యంలో సొంత సామాజిక వర్గానికి ఎటువంటి ప్రాధాన్యత లేకుండా పోతుంది. దీంతో ఆ సామాజిక వర్గంలో ఒక రకమైన అసంతృప్తి ప్రారంభం అయింది. అసలు ఉన్నది మన ప్రభుత్వమేనా అన్నట్టు కమ్మ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. కనీసం మంత్రి పదవులు సరైనవి దక్కలేదు. నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం లేదు. ఇతర పదవుల్లో కూడా ఎటువంటి ప్రయారిటీ దక్కడం లేదు. దీంతో ఒక రకమైన అంతర్మదనంలో టిడిపికి చెందిన కమ్మ సామాజిక వర్గం నేతలు ఉన్నారు.

గుంటూరు, కృష్ణా,పల్నాడు వంటి ప్రాంతాల్లో గత ఐదేళ్లుగా వైసిపి దాష్టికాలకు ఎదురోడ్డి నిలిచారు చాలామంది టీడీపీ నేతలు. ప్రత్తిపాటి పుల్లారావు, ఎరపతినేని శ్రీనివాసరావు, ధూళిపాళ్ల నరేంద్ర, దేవినేని ఉమా, ఆలపాటి రాజేంద్రప్రసాద్ వంటి నేతలు టిడిపి కోసం పరితపించేవారు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో టిడిపి శ్రేణులకు అండగా నిలబడేవారు. అటువంటి నేతలకు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి ప్రాధాన్యం లేకుండా పోతోంది. అంతెందుకు జగన్మోహన్ రెడ్డి హయాంలో తీవ్ర వివక్షకు గురయ్యారు ఐపీఎస్ అధికారి వెంకటేశ్వరరావు. రాష్ట్ర డిజిపి హోదాలో ఉండాల్సిన ఆయనకు పోస్టింగ్ లేకుండా పోయింది. గత ఐదేళ్లపాటు చంద్రబాబుతో సమానంగా ఆయన జగన్మోహన్ రెడ్డి పై న్యాయపోరాటం చేశారు. కూటమి అధికారంలోకి వస్తే తనకు మంచి పదవి దక్కుతుందని భావించారు. కానీ ఆయనకు చిన్న పదవి ఇచ్చి సంతృప్తి పరచాలని చంద్రబాబు భావించారు. అందుకే ఇచ్చిన పదవిని తీసుకోవడానికి ఐబి వెంకటేశ్వరరావు ముందుకు రావడం లేదు.

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కమ్మ సామాజిక వర్గం నేతల్లో ఆలోచన మారుతోంది. ఆ సామాజిక వర్గంలో సైతం చంద్రబాబుపై నమ్మకం పోతోంది. దేవినేని ఉమా పార్టీ కోసం పరితపించారు. అటువంటి వ్యక్తి త్యాగానికి తగిన ప్రతిఫలం చూపడంలో చంద్రబాబు విఫలమయ్యారు. గాలి ముద్దుకృష్ణమనాయుడు కుటుంబంలోనే ఆగాధం చోటుచేసుకుంది. కనీసం ఆ సమస్యపై దృష్టి పెట్టలేదు. ఆ కుటుంబాన్ని సముదాయించే ప్రయత్నం చేయలేదు. అందుకే ఆ కుటుంబానికి చెందిన గాలి జగదీష్ వైసీపీలో చేరేందుకు సిద్ధపడుతున్నారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరాం సైతం తీవ్ర ఆవేదనతో ఉన్నారు. పేరు మోసిన చాలా కమ్మ కుటుంబాలు ఇప్పుడు బాధతో ఉన్నాయి. క్రమేపి వారి ఆలోచనలో మార్పు వస్తే టిడిపికి దూరమయ్యే అవకాశం ఉంది.

ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కమ్మ సామాజిక వర్గంతో సహయోదయ ఏర్పాటు చేసుకుంటే మాత్రం.. వైసీపీలో చేరికలు మున్ముందు పెరగడం ఖాయం. ఇప్పటికే గన్నవరం తో పాటు గుడివాడలో.. కొడాలి నాని తో పాటు వల్లభనేని వంశీని దూరం చేసుకున్నామన్న బాధ కమ్మ సామాజిక వర్గంలో కనిపిస్తోంది. అప్పట్లో వారు వైసీపీలో ఉన్న కమ్మ సామాజిక వర్గానికి న్యాయం చేశారన్న టాక్ వినిపిస్తోంది. అయితే కమ్మ సామాజిక వర్గంలో ఈ మార్పు రావడం నిజంగా సంచలనమే. కానీ వారు ఎంతో ఊహించి పార్టీ కోసం కష్టించి పనిచేస్తే చంద్రబాబు గుర్తించడం లేదు. అందుకే వారు మనసు విరక్తి చేసుకుంటున్నారు. ఇదే పరంపర కొనసాగితే మాత్రం వారంతా వైసీపీలోకి వెళ్లడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!