Wednesday, March 19, 2025

జగన్ ఉంటే ఈ పరిస్థితి రాదు.. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ అంతర్మధనం!

- Advertisement -

చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఉంది కాంగ్రెస్ పరిస్థితి. ఏపీలో దారుణాతి దారుణంగా తయారయింది ఆ పార్టీ పరిస్థితి. ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్న ఫలించడం లేదు. పైగా రోజురోజుకు ఆ పార్టీ పరిస్థితి తిరో గమనంలోకి మారింది. నిర్వీర్యం అయ్యే పరిస్థితికి వచ్చింది. చిన్నాచితక నాయకులు సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతుండడంతో.. ఆ పార్టీకి అసలు తత్వం బోధపడింది. వైయస్ జగన్మోహన్ రెడ్డిని వదులుకోవడం తొలి తప్పిదమని అధినాయకత్వం భావిస్తోంది. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సైతం సన్నిహితుల వద్ద ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి లాంటి చరిస్మ ఉన్న నేతను వదులుకొని తప్పిదానికి పాల్పడ్డామని బాధపడినట్లు సమాచారం. ఇప్పుడు కాంగ్రెస్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది.

కాంగ్రెస్ పార్టీని ఏపీతోపాటు జాతీయస్థాయిలో నిలబెట్టారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ సైతం అదే ప్రాధాన్యమిచ్చింది మహానేతను. 2004లో తన రెక్కల కష్టంతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేగలిగారు రాజశేఖర్ రెడ్డి. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వ ఏర్పాటులో కూడా ఏపీ కీలక పాత్ర పోషించింది. రెండోసారి 2009లో సైతం రాజశేఖర్ రెడ్డి చరిస్మతోనే అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. యూపీఏ 2 ఏర్పడడానికి కారణం కూడా నాటి ఆంధ్రప్రదేశ్ ఎంపీలే. అంతటి శక్తివంతుడైన రాజశేఖర్ రెడ్డి అనుకొని ప్రమాదంలో చనిపోయారు. ఆ సమయంలో తన తండ్రి మరణంతో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తానని జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని కోరారు. అందుకు అనుమతించలేదు అధినాయకత్వం. తమ మాటను ధిక్కరించి బాధితులను పరామర్శించారని జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ. 16 నెలల పాటు జైలు జీవితం అనుభవించారు జగన్మోహన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారు. 9 ఏళ్ల పాటు శ్రమించి ఏపీలో అధికారంలోకి రాగలిగారు.

అయితే నాడు కాంగ్రెస్ పార్టీ ఘోర తప్పిదానికి పాల్పడింది. జగన్మోహన్ రెడ్డిని దూరం చేసుకోవడం ద్వారా తప్పుడు నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ అంటే మహావృక్షమని.. అందులో చిన్న పార్టీ ఆకుగా జగన్మోహన్ రెడ్డిని పరిగణించింది. కానీ అదే జగన్ ఇంతింతై అన్న మాదిరిగా బలమైన శక్తిగా మారారు. సమ్మోహన శక్తిగా మారిపోయారు. కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్ళతో పెకిలించారు. దశాబ్ద కాలం అవుతున్న ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఓటు కూడా పెంచుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డిని ద్వేషిస్తూ వస్తున్న ఆ పార్టీ.. ఇప్పుడిప్పుడే అసలు విషయాన్నీ గ్రహిస్తోంది. చేజేతులా జగన్మోహన్ రెడ్డిని దూరం చేసుకోవడం ద్వారానే తమకు ఈ పరిస్థితి వచ్చిందని భావిస్తోంది.

జాతీయ స్థాయిలో సైతం కాంగ్రెస్ పార్టీ పతనవస్థకు చేరుకుంది. వరుస వైఫల్యాలు ఆ పార్టీని కృంగదీస్తున్నాయి. ఈ తరుణంలో పోస్టుమార్టం జరుపుతోంది. ఒకప్పుడు దేశంలో అన్ని రాష్ట్రాలను శాసించిన ఆ పార్టీ పతనానికి దారి తీసిన కారణాలను అన్వేసిస్తోంది. అందులో భాగంగా ఏపీ విషయంలో జగన్మోహన్ రెడ్డిని దూరం చేసుకోవడమే అక్కడ పార్టీ పతనానికి కారణమని నిర్ణయానికి వచ్చింది. అయితే మున్ముందు జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఆశ్రయించే పరిస్థితి కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!