Wednesday, March 19, 2025

వాలంటీర్ల విషయంలో చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వం

- Advertisement -

ఎట్టకేలకు వాలంటీర్ల వ్యవస్థ పై ఫుల్ క్లారిటీ వచ్చింది. ఇక వాలంటీర్లను విధుల్లోకి తీసుకోరని స్పష్టమైంది. దాదాపు వాలంటీర్లను పక్కన పడేసినట్లేనని తేలిపోయింది. అసలు లేని వాలంటీర్ వ్యవస్థను తాము ఎలా కొనసాగిస్తామని నిండు సభలో మంత్రి చెప్పేసరికి వాలంటీర్లకు షాక్ తగిలింది. అదంతా పొలిటికల్ గేమ్ గా తేలిపోయింది.

ఏపీలో వాలంటరీ వ్యవస్థను ప్రారంభించింది వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి మానస పుత్రికగా ఈ వ్యవస్థ మారింది. ప్రతి 50 కుటుంబాల బాధ్యతను ఒక వలంటీర్ కు అప్పగించింది అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. పౌర సేవలతో పాటు సంక్షేమ పథకాలు అందించే బాధ్యతను అప్పగించింది. ఐదేళ్లపాటు సజావుగా సాగింది ఆ ప్రక్రియ. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రేక్ పడింది.

వైసిపి ప్రభుత్వ హయాంలో వాలంటీర్ వ్యవస్థపై అనే రకరకాల విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా టిడిపి అధినేత చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరచూ విమర్శలు చేసేవారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వాలంటీర్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పనిచేశారన్న ఆరోపణలు ఉండేవి. అందుకే సాధారణ ఎన్నికల్లో వారి సేవలను నిలిపివేయాలని కోరుతూ కూటమి పార్టీలు ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించాయి. దీంతో వాలంటీర్ల సేవలు నిలిచిపోయాయి.

అదే సమయంలో తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు పదివేల రూపాయల గౌరవ వేతనం అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే వాలంటీర్ల సేవలను ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని వారితో రాజీనామా చేయించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే చాలామంది రాజీనామా చేశారు. మరికొందరు పదివేల రూపాయల గౌరవ వేతనాన్ని ఆశించి రాజీనామా చేయలేదు.

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు పదివేల రూపాయల గౌరవ వేతనం అందుతుందని వాలంటీర్లు భావించారు. కానీ తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఒక్క ప్రకటన కూడా రాలేదు. ఈ తరుణంలో శాసనసభలో ప్రత్యేక ప్రకటన చేశారు మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి. 2023 ఆగస్టులోనే వైయస్సార్ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను కొనసాగించకుండా నిలిపివేసిన విషయాన్ని ప్రస్తావించారు. నిలిపివేసిన వ్యవస్థను ఎలా కొనసాగించమంటారని ప్రశ్నించారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ సైతం వలంటీర్ వ్యవస్థ ముగిసిన అధ్యయంగా తేల్చేశారు. అయితే తమకు జరిగిన అన్యాయంపై తీవ్ర అనుగ్రహంతో ఉన్నారు వాలంటీర్లు. తమ విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!