Sunday, March 16, 2025

నాగబాబు విషయంలో కన్ఫ్యూజన్.. ఇంతకీ ఏ పదవి ఇస్తారు?

- Advertisement -

ఒకసారి మంత్రి పదవి.. మరోసారి ఎమ్మెల్సీ.. మళ్లీ ఇప్పుడు రాజ్యసభ.. లేదంటే కార్పొరేషన్ చైర్మన్.. ఇలా కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తోంది కూటమి ప్రభుత్వం. మెగా బ్రదర్ నాగబాబు విషయంలో ఇలా రోజుకో పదవి అంటూ లీకులిస్తోంది. ఈ చర్యలతో జనసేన అభిమానులు సైతం బాధపడుతున్నారు. మెగా బ్రదర్ నాగబాబు జనసేనతో పాటు కూటమి కోసం గట్టిగానే కృషి చేశారు. అటువంటి నేత విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఎందుకు అన్నది ఇప్పుడు ప్రశ్న. పవన్ కళ్యాణ్ మాదిరిగా నాగబాబు ఉండరు. అందుకే నాగబాబు విషయంలో ఒక పద్ధతి ప్రకారం ఇబ్బంది పెట్టి చర్యలు చేపడుతున్నట్లు అనుమానాలు ఉన్నాయి.

జనసేనలో నాగబాబుది క్రియాశీలక పాత్ర. 2019 ఎన్నికల్లో నరసాపురం నుంచి పోటీ చేశారు నాగబాబు. అక్కడ మూడో స్థానానికి పరిమితం అయ్యారు. అటు తర్వాత కొద్ది రోజులు పాటు సైలెంట్ అయ్యారు నాగబాబు. కానీ తిరిగి జనసేన కార్యకలాపాల్లో తిరగడం ప్రారంభించారు. చాలా యాక్టివ్ గా పని చేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేశారు.

నరసాపురం ఎంపీగా పోటీ చేసిన నాగబాబు మరోసారి లోక్సభలో అడుగు పెట్టాలని భావించారు. అందుకే అనకాపల్లి నుంచి పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థిగా పోటీ చేయాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. అందుకే ఆ నియోజకవర్గ పరిధిలో వచ్చే ఎలమంచిలిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇంతలో సీన్ మారింది. మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. సీఎం రమేష్ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి అయ్యారు. దీంతో నాగబాబు డ్రాప్ కావాల్సి వచ్చింది.

అయితే ఎంపీగా అవకాశం లేకపోవడంతో హైదరాబాద్ వెళ్లిపోయారని నాగబాబుపై ప్రచారం నడిచింది. కానీ ఆయన రీ బ్యాక్ అయ్యారు. ఎన్నికల్లో చాలా యాక్టివ్ గా పని చేశారు. జనసేనతోపాటు కూటమి విజయానికి కృషి చేశారు. కూటమి అధికారంలోకి రావడంతో నాగబాబుకు తప్పకుండా పదవి దక్కుతుందని అంతా భావించారు. తొలుత టీటీడీ చైర్మన్ పోస్ట్ అని చెప్పారు. అటు తరువాత రాజ్యసభ పదవికి పంపిస్తామని చెప్పారు. కాదు కాదు ఎమ్మెల్సీ ని చేసి మంత్రిని చేస్తామని చెప్పారు. ఇప్పుడేమో మరోసారి రాజ్యసభ అంటున్నారు. పవన్ కళ్యాణ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తారని ప్రచారం చేస్తున్నారు. అయితే నాగబాబు విషయంలో ఈ కన్ఫ్యూజ్ జరుగుతుండడం పై మెగా అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!