Sunday, March 16, 2025

జనసేన నేతల చుట్టూ వివాదాలు.. తాజాగా కిరణ్ రాయల్ పై.

- Advertisement -

జనసేన నేతలు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ముఖ్యంగా లైంగిక వేధింపుల కేసులు వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. గత మూడు రోజులుగా తిరుపతి జనసేన ఇన్చార్జ్ కిరణ్ రాయల్ పై అనేక రకాల ఆరోపణలు వచ్చాయి. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. తన నుంచి కోటి 20 లక్షల నగదు తో పాటు 25 సవర్ల బంగారం తీసుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు మహిళ. ప్రస్తుతం తాను వీధిన పడ్డానని.. ఆత్మహత్యాయత్నం చేసుకుంటూ ఓ మహిళ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వెలుగు చూడడం ఆందోళన కలిగించింది. అక్కడితో ఆగకుండా వరుస వీడియోలు కిరణ్ రాయల్ పై విడుదలయ్యాయి. దీంతో జనసేన అప్రమత్తం అయ్యింది. వెంటనే అంతర్గత విచారణకు ఆదేశించింది. అంతవరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కిరణ్ రాయల్ కు సూచించింది.

కొద్ది రోజుల కిందట ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపులు కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆయన సైతం జనసేనలో చాలా క్రియాశీలక పాత్ర పోషించారు. ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు. ఎన్నికల్లో జనసేన స్టార్ క్యాంపైనర్ గా నిలిచారు. అయితే ఆయన ఉన్నట్టుండి ఒక్కసారిగా లైంగిక వేధింపుల ఆరోపణలకు గురయ్యారు. ఓ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఆయనపై నేరుగా ఫిర్యాదు చేశారు. దీంతో జానీ మాస్టర్ అరెస్ట్ కు గురయ్యారు. అప్పట్లో కూడా జనసేన హై కమాండ్ దీనిపై స్పందించింది. పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జానీ మాస్టర్ కు సూచించింది. ఇప్పుడు అదే పరిస్థితి ఎదురైంది కిరణ్ రాయల్ కు.

తిరుపతిలో జనసేనలో యాక్టివ్ రోల్ ప్లే చేశారు కిరణ్ రాయల్. ఈ ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేయాలని భావించారు. కానీ అవకాశం దక్కలేదు. అయితే వైసిపి పై దూకుడుగా ఉండే జనసేన నేతల్లో కిరణ్ రాయల్ ఒకరు. మొన్నటికి మొన్న కార్యకర్తల కోసం 2.0 గా అవతారం ఎత్తుతానని జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. దానిపై జనసేన నుంచి స్పందించింది తొలిసారిగా కిరణ్ రాయల్ మాత్రమే. జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ.. జగన్ చర్యలను తప్పుపట్టారు కిరణ్ రాయల్. అయితే ఆ ఘటన జరిగి రోజులు గడుస్తున్న నేపథ్యంలో ఏకంగా సోషల్ మీడియాలో ఆయన వేధింపులు వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది. తన వెనుక వైసిపి కుట్ర చేస్తోందని కిరణ్ రాయల్ ఇప్పుడు చెబుతూ వస్తున్నారు.

అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసేవారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ముఖ్యంగా వైసీపీ నేతలపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సమయంలో విశ్వరూపం ప్రదర్శించేవారు. అటువంటిది ఇప్పుడు సొంత పార్టీ నేతలే లైంగిక వేధింపుల కేసుల్లో చిక్కుకోవడం.. వారి వీడియోలు నేరుగా వెలుగు చూస్తుండడంతో ఇబ్బందికరంగా మారుతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు జనసేన వారిని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచిస్తుంది. అంతకుమించి ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది జనసేన నాయకత్వం

. ఈ ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేయాలని భావించారు. కానీ అవకాశం దక్కలేదు. అయితే వైసిపి పై దూకుడుగా ఉండే జనసేన నేతల్లో కిరణ్ రాయల్ ఒకరు. మొన్నటికి మొన్న కార్యకర్తల కోసం 2.0 గా అవతారం ఎత్తుతానని జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. దానిపై జనసేన నుంచి స్పందించింది తొలిసారిగా కిరణ్ రాయల్ మాత్రమే. జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ.. జగన్ చర్యలను తప్పుపట్టారు కిరణ్ రాయల్. అయితే ఆ ఘటన జరిగి రోజులు గడుస్తున్న నేపథ్యంలో ఏకంగా సోషల్ మీడియాలో ఆయన వేధింపులు వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తోంది. తన వెనుక వైసిపి కుట్ర చేస్తోందని కిరణ్ రాయల్ ఇప్పుడు చెబుతూ వస్తున్నారు.

అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసేవారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ముఖ్యంగా వైసీపీ నేతలపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సమయంలో విశ్వరూపం ప్రదర్శించేవారు. అటువంటిది ఇప్పుడు సొంత పార్టీ నేతలే లైంగిక వేధింపుల కేసుల్లో చిక్కుకోవడం.. వారి వీడియోలు నేరుగా వెలుగు చూస్తుండడంతో ఇబ్బందికరంగా మారుతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు జనసేన వారిని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచిస్తుంది. అంతకుమించి ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది జనసేన నాయకత్వం

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!