Wednesday, October 16, 2024

జగన్‌ను టచ్ చేసే ధైర్యం ఉందా..? వైసీపీ సర్కార్‌ను కూల్చే దమ్ముందా..?

- Advertisement -

తెలంగాణ సీఎ కేసీఆర్ .. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. తెలంగాణలో బీజేపీ రోజు రోజుకు బలపడుతుంది. దీనిని సీఎం కేసీఆర్ జీర్ఱించుకోలేకపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు బీజేపీ ఎక్కడ మొగుడు అవుతారో అని తెగ భయపడిపోతున్నారు. అయితే ఇదే సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగొలు చేస్తు అడ్డంగా దొరికిపోవడం కూడా సంచలనంగా మారింది. దీనిపై ప్రెస్ మీట్ పెట్టి మరి బీజేపీ అగ్ర నాయకత్వంపై నిప్పులు చేరిగారాయన. తమ ప్రభుత్వన్ని కూల్చేయాలని బీజేపీ ప్రయత్నిస్తుందని కేసీఆర్ మీడియా ముందు వెల్లడించారు. ఇదే సమయంలో తమతో పాటు మరో నాలుగు రాష్ట్రాల ప్రభుత్వలను పడేలని బీజేపీ ప్రయత్నిస్తోందని.. అందులో ఏపీ కూడా ఉందని చెప్పి మరో సంచలనాని తెరలేపారాయన.

అయితే ఇది సాధ్యం అయ్యే పనేనా అనిపిస్తుంది. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్‌ను కూల్చాలంటే 50 ఎమ్మెల్యేలు పార్టీ మారాల్సి ఉంది. అసలు ఇది జరుగుతుందా..? 50 50 ఎమ్మెల్యేలు జగన్‌ను కాదనుకుని బయటకు వస్తారా..? అది కూడా రాష్రంలో ఓటు బ్యాంకు లేని బీజేపీ వెంట నడస్తారా..? అంటే కష్టమనే చెప్పాలి. ఇంత చిన్న లాజిక్‌ను రెండుసార్లు సీఎం అయిన కేసీఆర్ మరిచిపోవడం విడ్డురంగా ఉంది. తమను బీజేపీ టార్గెట్ చేసుకుందని అసహనమో లేక.. తమ నిస్సహయతో తెలియడం లేదు కాని.. ప్రతి దానిలోకి ఏపీ ప్రభుత్వంను లాగడం తెలంగాణ నాయకులకు అలవాటుగా మారింది. సీఎం కేసీఆర్ కూతురు కవిత లిక్కర్ స్కాంలో ఆధారాలతో దొరికినప్పటి నుంచి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదో తెలియని భయం కనిపిస్తుంది.

పైకి గంభీరంగా ఉన్నప్పటికి కూడా లోలోపల మాత్రం వణికిపోతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే పక్క ప్రభుత్వలను కూడా తమతో కలిసి రావాలని ఆహ్వానిస్తోంది. పైగా బీజేపీ ప్రభుత్వలను కూల్చేస్తుందని కేసీఆర్ కొత్త విషయాన్ని బయటపెట్టినట్లుగా 3 గంటలు మీడియా సమావేశం పెట్టి చెప్పారు. ఇలా జరుగుతుందని దేశం మొత్తం తెలిసిన విషయమే. బీజేపీపై నిందలు వేస్తున్న కేసీఆర్..వేరే పార్టీ గుర్తుల మీద గెలిచిన ఎమ్మెల్యేలను తమ పార్టీలో ఎలా చేర్చుకున్నారో మొదటి చెప్పాల్సి ఉంటుంది. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కేసీఆర్.. ఇప్పుడు బీజేపీపై నిందలు వేయడం సరైంది కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేసీఆర్ ముందు తన రాజ్యం కాపాడుకుంటే చాలని.. తరువాత పక్క రాజ్యలు గురించి ఆలోచించడం బెటర్ అని హితవు పలుకుతున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!