Saturday, October 5, 2024

రాష్ట్రంలో వైఎస్ఆర్ విగ్రహం లేని ఏకైక గ్రామం అదే..! ఎక్కడో తెలుసా..?

- Advertisement -

వైఎస్ఆర్ ఈ పేరు తెలియని రాజకీయ అభిమానులు ఉండరు. రాజకీయాలు తెలియని ప్రజలకు కూడా వైఎస్ఆర్‌ను అభిమానిస్తుంటారు. తన పరిపాలనలో ప్రజలకు స్వర్ణయుగాన్ని చూపించారు. పార్టీలకు అతీతంగా పని చేసిన ఘనత వైఎస్ఆర్‌కు దక్కుతుంది. ప్రజలు కష్టాల్లో ఉన్నారంటే చాలు ఆయన చలించిపోయేవారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఏదో కూడా రూపంలో లబ్ది పొందినవారే. అందుకే చాలామంది వైఎస్ఆర్‌ను దేవుడిలా పూజిస్తుంటారు. మరి అలాంటి దేవుడు చనిపోతే.. తమ ఇంటి మనిషి చనిపోయినంతాగా ప్రజలు బాధపడ్డారు. వైఎస్ఆర్ చనిపోయారనే బాధతో వందల మంది మరణించారు కూడా. అది వైఎస్ఆర్ అంటే.

ఆయన మరణించి 13 సంవత్సరాలు దాటినప్పటికి కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పేరు మార్మోగుతునే ఉంటుంది. ఇప్పటికి కూడా తెలంగాణలో కూడా వైఎస్ఆర్ పేరు వినిపించిందంటే ఆయన చరిష్మా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వైఎస్ఆర్ మరణం తరువాత ఆయన రాజకీయ వారసత్వాన్ని జగన్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం జగన్ ఏపీకి సీఎంగా ఉన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ విషయం పక్కన పెడితే వైఎస్ఆర్ మరణం తరువాత ఆయన గుర్తుగా ప్రతి గ్రామంలోను ఆయన విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నారు అభిమానులు.

ఏపీతో పాటు తెలంగాణలో కూడా చాలా చోట్ల వైఎస్ఆర్ విగ్రహాలు మనకు దర్శనం ఇస్తాయి. అభిమానులు , కార్యకర్తలు నాయకులు వైఎస్ఆర్‌ గుర్తుగా విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో అయితే వైఎస్ఆర్ విగ్రహాలు మనకు ఎక్కువుగా కనిపిస్తాయి. ఏపీలో ఊరుకి ఒకటైనా వైఎస్ఆర్ విగ్రహాం కనిపిస్తోంది. కొన్ని గ్రామాల్లో అయితే గరిష్టంగా అయిదారు విగ్రహాలు వరకు ఏర్పాటు చేశారు అభిమానులు. కాని ఏపీలో వైఎస్ఆర్ విగ్రహం లేని ఏకైక ఊరు క‌ృష్టాజిల్లాలో ఉంది.ఆ గ్రామం మరేదో కాదు టీడీపీ వ్యవస్థపకులు ఎన్టీఆర్ సొంత గ్రామం అయిన నిమ్మకూరు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!