Friday, April 26, 2024

గుడివాడలో టీడీపీకి పాత మొగుడే దిక్కా..? కొడాలి మీద పోటీకి ఇష్టం చూపని నారా, నందమూరి వంశం

- Advertisement -

కొడాలి మీద పోటీకి ఇష్టం చూపని నారా ,నందమూరి వంశం..గుడివాడలో టీడీపీకి పాత మొగుడే దిక్కా..?

వచ్చే ఎన్నికల్లో గుడివాడలో ఎవరు గెలుస్తారు అని అందరు అతృతుగా ఎదురు చూస్తారని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. ఈ సీటు నుంచి ఎవరు విజయం సాధిస్తారు అనే దానిపై లక్షల కోట్లు పందెలు జరిగిన ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. అయితే గుడివాడలో ఎవరు విజయం సాధిస్తారు అనే దాని కన్నా కూడా… గుడివాడలో టీడీపీ తరుఫున ఎవరు బరిలోకి దిగుతారా అనేది ఇక్కడ హాట్ టాపిక్‌గా మారింది. గుడివాడలో టీడీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారో అనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఇంకా చెప్పాలంటే గుడివాడలో టీడీపీకి సరైన అభ్యర్థే లేడని చెప్పాలి. గుడివాడలో టీడీపీ ఒకప్పుడు బలంగా ఉండేది. ఎప్పుడు ఎన్నికలు జరిగిన కూడా అక్కడ టీడీపీ అభ్యర్థే విజయం సాధించేవారు. కాని కొడాలి నాని వచ్చిన తరువాత అక్కడ లెక్కలు అన్ని కూడా మారిపోయాయి.

గుడివాడను తన అడ్డా మార్చుకున్నారు గత 20 ఏళ్లుగా వరుసగా విజయాలు సాధిస్తు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారాయన. పార్టీలతో సంబంధం లేకుండా వరుసగా నాలుగుసార్లు విజయం సాధించారాయన. 2004, 2009లో టీడీపీ తరుఫున విజయం సాధించిన ఆయన తరువాత వైసీపీలో చేరి 20014,2019లలో మరో రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రిగా కూడా పని చేశారు. గతంలో గుడివాడ టీడీపీకి కంచుకోటగా ఉండేది. అలాంటి కొడాలి నాని వచ్చిన తరువాత పార్టీలకు అతీతంగా తన ఇమేజ్‌ను క్రియేట్ చేస్తున్నారు. నానికి గుడివాడలో వ్యక్తిగత ఫాలోయింగ్ ఎక్కువుగా ఉంటుంది. ముఖ్యంగా అక్కడి పేదవారు కొడాలిని దేవుడుగా కొలుస్తుంటారు.

అయితే గుడివాడలో కొడాలి నాని మీద పోటీ చేయడానికి ప్రత్యర్థులందరు కూడా బయపడుతున్నారు. ముఖ్యంగా టీడీపీ వచ్చే ఎన్నికల్లో గుడివాడలో కొడాలి నానిని ఓడించాలని కలలు కంటున్నప్పటి కూడా అక్కడ నుంచి పోటీ చేయడానికి సరైన అభ్యర్థులు లేక సతమతం అవుతుంది. బాలకృష్ణ , నారా లోకేష్ వంటి నేతలే అక్కడ నుంచి పోటీ చేయడానికి గజ గజలాడుతున్నారు. బాలకృష్ణ హిందుపురం నుంచి రానని..నారా లోకేష్ గుడివాడ వెళ్లనని పార్టీ అధినేత చంద్రబాబుకు తేల్చి చెప్పేశారట. దీంతో గుడివాడలో ఎవరిని బరిలోకి దించాలో చంద్రబాబుకు అర్థం కాక తల పట్టుకుంటున్నారట. ఇక గుడివాడలో టీడీపీకి మిగిలిన దిక్కు.. రావి వెంకటేశ్వరరావు. ఆయన్నే కొడాలి నాని మీద పోటీ చేయించడానికి సిద్దం అవుతున్నారట. కొడాలి నాని మీద పోటీ చేయడానికి నాయకులు ఎవరు ముందుకు రాకపోవడంతో.. మరోసారి రావి వెంకటేశ్వరరావునే నమ్ముకున్నారని తెలుస్తుంది. దీంతో టీడీపీ శ్రేణులు కూడా ఢీలా పడ్డాయి.కొడాలి నానిని ఎదుర్కొవడం రావి వెంకటేశ్వరరావు వల్ల కాదని టీడీపీ శ్రేణులే చెప్పడం విశేషం. గుడివాడలో టీడీపీకి పాత మొగుడే దిక్కా.. అంటూ సైటెర్లు కూడా వినిపిస్తున్నాయి. మరి రావి వెంకటేశ్వరరావు ఈసారి గుడివాడలో కొడాలిని ఎలా నిలువరిస్తారో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!