Wednesday, October 16, 2024

అయ్య‌న్న‌పాత్రుడుకు హైకోర్టు బిగ్ షాక్

- Advertisement -

టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి అయ్య‌న్న‌పాత్రుడుకు హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. తన మీద ఉన్న కేసును కొట్టివేయాలని హైకోర్టును అయ్య‌న్న‌పాత్రుడు ఆశ్రయించారు. అయితే ఆయనకు అక్కడ నిరాశే ఎదురైంది. అయ్య‌న్న‌పాత్రుడు తరుఫున న్యాయవాది వాదనలు విన్న న్యాయస్థానం వారితో ఏకీభవించలేదు. పైగా అయ్య‌న్న‌పాత్రుడును విచారించవచ్చని తెలపడం సంచలనంగా మారింది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే…

ప్రభుత్వ స్థలంలో అయ్య‌న్న‌పాత్రుడు ఇంటి ప్రహరీ గోడ ఉందని గుర్తించిన అధికారులు … దీనిపై నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనిపై అయ్య‌న్న‌పాత్రుడు స్పందించకపోవడంతో.. మున్సిపాల్ అధికారులు ప్రభుత్వ స్థలంలో ఉన్న ప్రహరీ గోడను కూల్చివేశారు అధికారులు. అయితే ఆ సమయంలో అయ్య‌న్న‌పాత్రుడు కొడుకు ఆవేశంగా ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. దీనిపై కోర్టుకు వెళ్లడానికి కూడా తాము సిద్దంగా ఉన్నామని అయ్య‌న్న‌పాత్రుడు కుమారుడు తెలిపారు. అయితే ఇలా కోర్టుకు వెళ్లడమే ఇప్పుడు వారికి కొత్త కష్టాలు తెచ్చి పెట్టాయి. అయ్య‌న్న‌పాత్రుడు ఇంటి ప్రహ‌రీ గోడ‌కు సంబంధించి కోర్టుకు సంబంధించిన పత్రాలు..ఫోర్జ‌రీ ప‌త్రాలు అని సీఐడీ అధికారులు గుర్తించారు.

కోర్టుకు ఫోర్జ‌రీ ప‌త్రాలు స‌మ‌ర్పించార‌ని సీఐడీ అధికారులు కేసు న‌మోదు చేశారు. ఇందులో భాగంగానే గత గురువారం తెల్ల‌వారుజామున అయ్య‌న్న ఇంటికి సీఐడీ అధికారులు వెళ్లి అయ్య‌న్న, ఆయ‌న కుమారుడు రాజేష్ అరెస్ట్‌ చేయడం జరిగింది. వాళ్లిద్ద‌రిపై నాన్‌బెయిల‌బుల్ కేసులు న‌మోదు చేశారు. అయితే దీనిపై వెంటనే వారికి బెయిల్ మంజూరు అయింది. అయ్య‌న్న‌పాత్రుడు బెయిల్ మీద బయటకు రావడంతో.. టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. అయితే ఆయన తాజాగా తన మీద కేసులను కొట్టివేయాలని య్య‌న్న‌పాత్రుడు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడాన్ని కొట్టివేయడానికి నిరాకరించింది. అక్కడితో ఆగకుండా.. అయ్య‌న్న‌పాత్రుడు ఆయన కొడుకు రాజేష్‌ను విచారించుకోవచ్చని సీఐడీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు తీర్పుతో అయ్య‌న్న‌పాత్రుడు వర్గం పూర్తిగా నిరాశలో మునిగిపోయారు. మరి సీఐడీ దర్యాప్తులో అయ్య‌న్న‌పాత్రుడు ఎలా విచారిస్తారో చూడాల్సి ఉంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!