ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయాలు తీసుకోవడానికి రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయన బరిలోకి దిగుతున్నారు. మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఆయన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఏ రాష్ట్రంలో అమలు చేయనన్ని సంక్షేమ పథకాలను ఏపీలో అమలు చేస్తున్నారాయన. అయినప్పటికి కూడా వైసీపీ పాలన మీద ఎక్కడో ఒక చోట వ్యతిరేకత వస్తుంది. ముఖ్యంగా కొందరు ఎమ్మెల్యేల పనితీరు పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు స్పష్ట అవుతుంది. ఇప్పటికే ఎమ్మెల్యేల తీరు మార్చుకోవాలని పలుమార్లు జగన్‌కు సూచించడం జరిగింది. అయినప్పటికి కూడా వారిలో ఎటువంటి మార్పు లేదని తెలుస్తోంది. దీంతో జగన్ వారిపై కఠినంగానే ఉండేందుకు రెడీ అవుతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..
వైఎస్ జగన్ ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ బ్రాండ్ అనే చెప్పాలి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు వైఎస్ జగన్. 2009లో కడప ఎంపీగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఆ తరవాత ఆయన తండ్రి వైఎస్ఆర్ మరణించడం, కాంగ్రెస్ పార్టీని కాదని జగనే స్వయంగా తన తండ్రి పేరు మీద పార్టీ స్థాపించడం అన్ని కూడా చక చక జరిగిపోయాయి. పార్టీ పెట్టిన నాటి నుంచి జగన్ ప్రజలతోనే ఉన్నారు. పార్టీలోకి నాయకులు, వస్తున్నారు , పోతున్నారు. కాని వారి ఎవరిని కూడా జగన్ నమ్మకుంది లేదు. జగన్ నమ్ముకుందల్లా తన కష్టాన్ని , ప్రజలను మాత్రమే నమ్మకుని ముందుకు సాగారు.
2014లో జగన్ సీఎం అవుతారని అంతా కూడా భావించారు. కాని అప్పుడు జరిగిన చిన్న చిన్న పొరపాట్లు వల్ల జగన్ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ఓటమి నుంచి వెంటనే తెరుకున్న జగన్ నిత్యం ప్రజలతో ఉన్నారు. తన సుదీర్ఘ పాదయాత్రతో ప్రజలకు నేనున్నాను అంటూ భరోసా కల్పించారు. దీంతో ఆయన 2019లో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో జగన్ నేతృత్వంలోని వైసీపీ పార్టీ 175 సీట్లగాను , 151 సీట్లను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. గతంలో ఏ నాయకుడు కూడా ఇంతటి భారీ విజయాన్ని సాధించింది లేదు. అయితే 151 సీట్లు కూడా జగన్‌ను ఓట్లు వేసిన వారే తప్ప సొంతంగా గెలిచిన నాయకుడు ఎవరు లేరనేది అందరికి తెలిసిన విషయమే. దీనిని ప్రత్యర్థులు సైతం ఒప్పుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎన్నో అంచనాలు , ఆశయాల మధ్య జగన్ సీఎం అయ్యారు. అయితే కొత్తగా గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేల తీరు వేరేలా ఉందని తెలుస్తోంది. వైసీపీలో కొత్తగా చట్టసభకు వెళ్లిన వారు చాలామంది తాము తమ బలంతోనే గెలిచామని విర్రవిగుతున్నారట.
పైగావారి నియోజిక వర్గాల్లో వారి పనితీరు కూడా విమర్శలకు తావు ఇచ్చేలా ఉందని తెలుస్తోంది. వీరు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా వారి సొంత వ్యాపారాలపైనే దృష్టి సారిస్తున్నారట. అధికారులకు , పోలీసులకు కూడా ఫోన్లు చేసి బెదిరించి మరి వారి పనులు చేయించుకుంటున్నారని తెలుస్తోంది. మరికొంతమంది అయితే ఇసుక వ్యాపారం కూడా చేస్తున్నారని సమాచారం అందుతోంది. మెజార్టీ కొత్త ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇలానే ఉన్నారని గ్రౌండ్ రిపోర్ట్ సీఎం జగన్ వద్దకు చేరింది. దీంతో ఆయా ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్ష చేయించారని తెలుస్తోంది.
సమీక్షలో చెడ్డపేరు ఉన్నవారి పేర్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టనున్నారట జగన్. వచ్చే ఎన్నికల్లో వారికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పేశారట సీఎం. ఇలా తమ వ్యవహరశైలితో జగన్‌కు తలనొప్పులు తెస్తున్నారట కొత్తగా ఎన్నికైనా ఎమ్మెల్యేలు. మరి జగన్ జోక్యంతో అయిన వారి ప్రవర్తనలో మార్పు వస్తుందో లేదో చూడాలి.