Tuesday, April 22, 2025

అంత వృద్ధిరేటు ఎలా సాధ్యం బాబూ!

- Advertisement -

ఎద్దు ఈనిందంటే దూడను కట్టేయండి అన్నట్టు ఉంది ఏపీ సీఎం చంద్రబాబు వైఖరి. ఏపీ రాష్ట్ర అభివృద్ధి రేటు 8.2 శాతం ఉందని.. అమాంతం పెరిగిపోయిందంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు పతాక శీర్షిక కథనాలు రాయడం విమర్శలకు గురిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వివరాలను ఇప్పుడు వృద్ధిరేటుగా చూపిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇందులో ఎటువంటి ప్రామాణికాలు, మార్గదర్శకాలు పాటించడం లేదని స్పష్టమవుతోంది.

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతోంది. ఈ స్వల్ప కాలంలో లక్ష నలభై వేల కోట్లకు పైగా అప్పులు చేశారు. అంటే అప్పులు చేసిన రాష్ట్రంలో వృద్ధిరేటు పెరుగుతుందా? ఆదాయం లేకుండా జిడిపి ఎలా? కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికలు, ఆధారాలతోనే ఈ వృద్ధిరేటు సాధ్యమై ఉంటుంది. అంతే తప్ప ఇది వాస్తవం కాదు.

చెత్త పన్ను వేస్తున్నారు. ఆస్తిపన్ను వసూలు చేస్తున్నారు. లేనిపోని భారం మోపుతున్నారు. రకరకాల రూపంలో విద్యుత్ సుంకాలు వసూలు చేస్తున్నారు. కానీ పేదవాడికి అవసరమైన వైద్యం అందించడం లేదు. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడం లేదు. సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించను లేదు. నిధులు ఇవ్వలేని రాష్ట్రం వృద్ధిరేటులో రెండో స్థానంలో ఉందని చెబుతుండడం మాత్రం హాస్యాస్పదం.

జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పదవీకాలంలో ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో రెండు లక్షల 78 కోట్ల రూపాయలు అందించారు. ప్రజలకు నగదు బదిలీ చేశారు. ప్రతి పేదవాడికి వైద్యం అందించారు. పాఠశాలలను బాగు చేయించారు. ఒకవైపు అభివృద్ధి పనులు చేపడుతూనే ఇంకోవైపు ప్రజల ఆర్థిక స్థితి పెంచే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేశారు. అప్పుడే వృద్ధిరేటు అమాంతం పెరిగింది. ప్రజలకు జీవనోపాధితో పాటు ఆర్థిక భారం కూడా కలిగింది.

కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతుంది. ఆదాయం సృష్టి అన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. రెట్టింపు సంక్షేమం అంటూ ప్రకటనలు చేశారు. సూపర్ సిక్స్ పథకాలని హడావిడి చేశారు. కానీ ఒక్క పథకం ప్రారంభించలేదు. ఒక్క హామీని కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు. కానీ రాష్ట్రంలో వృద్ధిరేటు మాత్రం పెరిగిపోతోందని చెబుతున్నారు. ప్రచార అస్త్రంగా మార్చుకుంటున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!