Wednesday, March 19, 2025

వైసిపి గూటికి జెసి కుటుంబం?

- Advertisement -

తాడిపత్రిలో సీన్ మారుతోందా? జెసి కుటుంబం కొత్త ఆలోచన చేస్తోందా? టిడిపి పై తీవ్ర అసంతృప్తితో ఉందా? వైసీపీ వైపు సంకేతాలు పంపుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి సాకే శైలజానాథ్ వైసీపీలో చేరారు. ఆయన జెసి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. తప్పకుండా జెసి కుటుంబం డైరెక్షన్ తోనే ఆయన వైసీపీ గూటికి చేరినట్లు ప్రచారం నడుస్తోంది. ఆయన జెసి దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి ని కలిసిన తరువాతే.. తాడేపల్లి లో జగన్ సమక్షంలో వైసీపీలో చేరడం విశేషం. దీంతో జెసి కుటుంబంలో సైతం త్వరలో వైసిపి గూటికి వస్తుందన్న ప్రచారం ప్రారంభం అయ్యింది.

జెసి కుటుంబానికి అనంతపురం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. వైయస్ రాజశేఖర్ రెడ్డితో సైతం సాన్నిహిత్యం ఉంది. అందుకే 2004లో తన క్యాబినెట్ లోకి జెసి దివాకర్ రెడ్డిని తీసుకున్నారు రాజశేఖరరెడ్డి. అయితే 2009లో ఒక ప్రత్యేక పరిస్థితుల్లో దివాకర్ రెడ్డికి క్యాబినెట్లో చోటు దక్కలేదు. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి తో చిన్నపాటి గ్యాప్ ఏర్పడింది. అదే జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి విభేదించడానికి కారణం అయింది. అయితే దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి తో జగన్మోహన్ రెడ్డికి మంచి స్నేహం ఉంది. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు కూడా. అయితే అనంతపురం జిల్లాలో రాజకీయ సమీకరణలు కారణంగా జెసి కుటుంబం అనూహ్యంగా తెలుగుదేశం గూటికి వెళ్లాల్సి వచ్చింది.

తప్పనిసరి పరిస్థితుల్లో జెసి కుటుంబం తెలుగుదేశం పార్టీలో కొనసాగాల్సి వస్తోంది. ఆ పార్టీలో ఎటువంటి ప్రాధాన్యం ఆ కుటుంబానికి దక్కడం లేదు. ఇప్పటివరకు క్యాబినెట్ మంత్రి పదవి కానీ.. కేంద్ర మంత్రి పదవి గాని దక్కలేదు. 2014లో దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపీ అయ్యారు. కానీ ఐదేళ్లపాటు జిల్లాపై ఎటువంటి మార్కు చూపలేదు. 2019లో దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డికి ఎంపీగా ఛాన్స్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో మాత్రం కేవలం ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డికి మాత్రమే అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. పవన్ రెడ్డి విషయంలో మొండి చేయి చూపారు. ఇదే జేసీ కుటుంబంలో అసంతృప్తికి కారణం.

ఈ ఎన్నికల్లో జేసీ అస్మిత్ రెడ్డి గెలిచారు. కానీ కానీ అనంతపురంలో ఎటువంటి ప్రాధాన్యం లేకుండా పోతోంది. ఇటీవల కడప జిల్లాకు చెందిన బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తో జెసి ప్రభాకర్ రెడ్డికి వివాదం ఏర్పడింది. ఆ సమయంలో సీఎం చంద్రబాబు పంచాయితీ చేశారు. కానీ ఆదినారాయణ రెడ్డి వైపు కొమ్ము కాసారు అన్నది జెసి ఫ్యామిలీ నుంచి ఆరోపణ. ఈ పరిణామాలతో జెసి కుటుంబం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. మరోవైపు సన్నిహితుడుగా ఉన్న సాకే శైలజానాథ్ చేరడం వైసిపిలో చేరడం వెనుక జెసి కుటుంబం ఉందని వార్తలు వస్తున్నాయి. ముందుగా శైలజానాద్ను పంపించి.. తరువాత జెసి పవన్ రెడ్డి వైసిపి తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!