Wednesday, March 19, 2025

కాపులపై జగన్ ఫుల్ ఫోకస్.. పార్టీలో మెజారిటీ పదవులు వారికే!

- Advertisement -

జగన్మోహన్ రెడ్డి పోయిన చోటే వెతుక్కుంటున్నారా? దూరమైన వర్గాలను దరి చేసుకునే పనిలో పడ్డారా? ముఖ్యంగా సామాజిక వర్గాలను దగ్గర చేసుకోవాలని చూస్తున్నారా? ప్రధానంగా కాపు సామాజిక వర్గం పై ఫోకస్ పెట్టారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం దూరమై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. ఇతర సామాజిక వర్గాలు అండగా నిలుస్తాయని భావించి కాపుల విషయంలో వేరే ఆలోచనలో పడ్డారు జగన్మోహన్ రెడ్డి. కాపుల్లో కొంత భాగమైన తమకు అండగా నిలుస్తారని అంచనా వేశారు. కానీ ఆ అంచనా తప్పింది. కాపులు ఏకపక్షంగా కూటమి వైపు మొగ్గు చూపారు. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దారుణ పరాజయం ఎదురయింది. అయితే దాని నుంచి గుణపాఠాలు నేర్చుకున్న జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పోగొట్టుకున్నామో.. అక్కడే తిరిగి పొందేలా ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పదవుల్లో కాపు సామాజిక వర్గం నేతలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. బొత్స సత్యనారాయణ నుంచి పేర్ని నాని వరకు… గుడివాడ అమర్నాథ్ నుంచి దాడిశెట్టి రాజా వరకు ఇలా అందరి నేతలను వాడేస్తున్నారు. వారి సేవలను వినియోగించుకుంటున్నారు. కీలక నియామకాల్లో వారి పేరును తెరపైకి తెస్తున్నారు. వారికి కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో రీజనల్ కోఆర్డినేటర్ వ్యవస్థ అత్యున్నతమైనది. 2024 ఎన్నికలకు ముందు రెడ్డి సామాజిక వర్గం నేతలకు, తన అస్మదీయులకు కోఆర్డినేటర్ పదవులు ఇచ్చేవారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈసారి మాత్రం అందులో మార్పు వచ్చింది. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ పోస్టును కాపు సామాజిక వర్గం నేత కురసాల కన్నబాబుకు అప్పగించారు. ఉభయగోదావరి జిల్లాల పార్టీ కోఆర్డినేటర్ పదవిని సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు కట్టబెట్టారు.

ఇక అన్ని జిల్లాల అధ్యక్షులు కూడా కాపు సామాజిక వర్గం నేతలు అధికం. విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మజ్జి శ్రీనివాసరావుకు చాన్స్ ఇచ్చారు. ఈయన కాపు సామాజిక వర్గం నేత. ఆపై జిల్లా పరిషత్ చైర్మన్ గా కూడా ఉన్నారు బొత్స సత్యనారాయణకు స్వయాన మేనల్లుడు. విశాఖ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు అవకాశం ఇచ్చారు జగన్. ఈయన సైతం కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కి ఛాన్స్ ఇచ్చారు. ఆయన సైతం కాపు సామాజిక వర్గం నేతే. కాకినాడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా దాడిశెట్టి రాజాకు అవకాశం ఇచ్చారు. మొన్నటి వరకు మంత్రిగా ఉన్న ఆయనకు జిల్లా పగ్గాలు అప్పగించారు.

మరోవైపు కాపుల్లో సీనియర్ నేతగా గుర్తింపు సాధించిన బొత్స సత్యనారాయణకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. విశాఖ జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఛాన్స్ కల్పించారు. శాసనమండలిలో వైసీపీ పక్షనేతగా ఎన్నుకున్నారు. అదే సమయంలో ఉభయ గోదావరి జిల్లాల బాధ్యతను అప్పగించారు.

ఇక ముద్రగడ పద్మనాభం సేవలను సైతం వినియోగించుకోవాలని భావిస్తున్నారు. కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడిగా ముద్రగడ పద్మనాభం అందరికీ సుపరిచితం. మరోసారి కాపు ఉద్యమం తేవాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రతి ఎన్నికల్లోను కాపు సామాజిక వర్గం డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉంది. అందుకే వచ్చే ఎన్నికల నాటికి కాపుల్లో ఒక రకమైన చేంజ్ తేవాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే పార్టీలోనూ కాపు నేతలకు టాప్ ప్రయారిటీ కల్పిస్తున్నారు. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!