Wednesday, March 19, 2025

వైయస్ రాజశేఖర్ రెడ్డి తో నటించిన హాస్యబ్రహ్మ బ్రహ్మానందం.. ఏ చిత్రంలో తెలుసా?

- Advertisement -

తెలుగు సినీ పరిశ్రమలో హాస్యనటుడు బ్రహ్మానందానిది ప్రత్యేక స్థానం. ఎంతోమంది హాస్యనటులు వెండితెరను అలరించినా.. బ్రహ్మానందానికి మాత్రం ప్రత్యేక స్థానమే. ఎన్ని జనరేషన్ లు అయినా.. ఆయన తన హాస్యంతో ప్రేక్షకుల మదిని దోచారు. నాటి నందమూరి తారకరామారావు నుంచి నేటి యువ కథ నాయకుల వరకు అందరితోనూ నటించారు. అయితే ఆయన వైయస్ రాజశేఖర్ రెడ్డి తో చిత్రంలో నటించారట. ఓ గ్రామీణ నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకొని దర్శకుడు అరుణ్ ప్రసాద్ ఈ సినిమాను Brahmanandam తెరకెక్కించారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హాస్యనటుడు బ్రహ్మానందం రాజశేఖర్ రెడ్డి తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన పొలిటికల్ లెజెండ్రీ.. ఆపై గొప్ప మనసున్న నేత అంటూ కొనియాడారు. ఆయనతో ఆ చిత్రం షూటింగ్ సమయంలో గడిపే అవకాశం వచ్చిందని చెప్పుకొచ్చారు. ఎప్పుడు ఎక్కడ కలిసినా తన ఆప్యాయత చూపేవారని గుర్తు చేసుకున్నారు. ఓ మహా నేతతో పని చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. అయితే దురదృష్టవశాత్తు ఆ సినిమా ఇంతవరకు విడుదల కాలేదని బాధపడ్డారు బ్రహ్మానందం.

తెలుగు చిత్ర పరిశ్రమలో దూసుకొచ్చారు దర్శకుడు అరుణ్ ప్రసాద్. పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు చిత్రంతో ఆయన పేరు మార్మోగిపోయింది. కానీ ఆయన తీసిన చిత్రాలు తరువాత ఆశించిన స్థాయిలో ఆడలేదు. ప్రేక్షక ఆదరణ పొందలేదు.

తమ్ముడు’ మూవీ తర్వాత బాలకృష్ణతో ‘భలేవాడివి బాసూ’, శ్రీకాంత్‌తో ‘ప్రేమ సందడి’, నవ్‌దీప్‌తో ‘గౌతమ్ ఎస్.ఎస్. సీ’, ‘యాగం’, జగపతి బాబుతో ‘మా నాన్న చిరంజీవి’, ‘చట్టం’ సినిమాలు చేశాడు అరుణ్ ప్రసాద్. 2008లో బ్రహ్మానందం ప్రధాన పాత్రలో ఓ సినిమా ప్లాన్ చేశాడు అరుణ్ ప్రసాద్..

ఓ మారుమూల తండాకి చెందిన ఓ గిరిజనులు, తన ఊరికి కావాల్సిన కనీస సదుపాయాలు కల్పన కోసం ముఖ్యమంత్రిని ఎలా కలిశాడనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో హేమ, ఆలీ కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. డైలాగ్స్ లేకుండా తెరకెక్కిన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల రిలీజ్ కాలేదు. ఇందులో ముఖ్యమంత్రి పాత్రలో నిజంగానే సీఎం రాజశేఖర్ రెడ్డి నటించారు. ఇది పూర్తి మూకీ సినిమా. అనివార్య కారణాలవల్ల విడుదల కాలేదు. కానీ ఆ చిత్రం సమయంలో రాజశేఖర్ రెడ్డితో గడిపిన సందర్భాలను గుర్తుచేసుకొని ఆనందపడ్డారు బ్రహ్మానందం

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!