Sunday, March 16, 2025

2029 లో జగన్ దే అధికారం.. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో స్పష్టం!

- Advertisement -

పోతలూరి వీరబ్రహ్మం గారు చెప్పినవన్నీ నిజమవుతున్నాయి. కలికాలం అనుకున్న.. కరోనా వైరస్ వరకు అన్ని కళ్ళముందే కనిపించాయి. ఇప్పుడు అంతా బానే ఉంది కానీ.. మళ్లీ బ్రహ్మంగారి చెప్పిన రాజకీయ కాలజ్ఞానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎవరికివారుగా వాటిని అన్వయించుకుంటున్నారు. తమకు అనుకూలంగా ఉన్నవారు కొందరు ఫార్వర్డ్ చేస్తున్నారు. అయితే ఇందులో నిజం ఎంత? రాజకీయాల్లో కూడా బ్రహ్మంగారి భవిష్యవాణి పనిచేస్తుందా? లేదా? అన్నది తెలియాలంటే.. అసలు ఆ కథేంటో తెలుసుకోవాలి.

చంద్ర దోషము పోయి రాజన్న రాజ్యం వచ్చే అని రాసిన ఓ 5 వాక్యాల బ్రహ్మంగారి కాలజ్ఞానం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. 2029 నాటికి చంద్రబాబు నాయుడు గద్దె దిగుతారని.. జగన్మోహన్ రెడ్డి అధికారం చేపడతారని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బలంగా నమ్ముతున్నాయి. ఇటువంటి సమయంలోనే బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటూ తెగ ప్రచారం నడుస్తుండడం విశేషం. ఈ ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ విషయంలో సైతం ఇదే తరహా ప్రచారం జరిగింది. తెలుగు రాష్ట్రమున పవన్ వస్తాడు. రాజ వారసత్వం నశించును అని అప్పట్లో బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయింది. పవన్ కళ్యాణ్ కూటమిలో కీలకపాత్ర పోషిస్తూ అధికారంలోకి రాగలిగారు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అలానే అధికారంలోకి వస్తారని.. ఏపీకి చంద్ర దోషము పోయి రాజన్న రాజ్యం వస్తుందని వైసీపీ శ్రేణులు ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.

తాను అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తానని జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇప్పుడు అదే రాజన్న రాజ్యం చుట్టూ బ్రహ్మంగారి కాలజ్ఞానం నడిచినట్లు ప్రచారం నడుస్తోంది. సాధారణంగా ఓ పద్యమైనా.. వచనమైన నాలుగు లైన్లకే పరిమితమై ఉంటుంది. ఇప్పుడు చంద్ర దోషం పోయి.. రాజన్న రాజ్యం వస్తుందని నాలుగో లైన్ లో చెప్పుకొచ్చారు. అందుకే ఇది నిజమవుతుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆశాభావంతో ఉన్నాయి.

వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటీవల బలంగా బయటకు వస్తున్నారు. ప్రజల మధ్యకు వస్తుండడంతో జనాలు నీరాజనాలు పలుకుతున్నారు. 2029 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకం పెరుగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే బ్రహ్మంగారి కాలజ్ఞానం అంటూ సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న ఈ పోస్టు తెగ ఆకట్టుకుంటోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపుతోంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!