[11:44 AM, 2/26/2025] Journalist Dharama: పవన్ కళ్యాణ్ పై జనసేన శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మరో 15 ఏళ్ల పాటు టీడీపీతో కలిసి నడుస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే మాలో మాకు వంద ఉంటాయి.. అయినప్పటికీ సర్దుకొని ముందుకు సాగుతాం అంటూ పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరో 15 ఏళ్ల పాటు వైసీపీని అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వమని పవన్ చెప్పారు. అయితే పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.
ఆది నుంచి పవన్ కళ్యాణ్ తీరు ఇలానే ఉంది. మొన్నటికి మొన్న చంద్రబాబు రాష్ట్రానికి మరో 10 ఏళ్ల పాటు సీఎం గా ఉండాలని తాను భావిస్తున్నానని చెప్పుకొచ్చారు. దీనిపై జన సైనికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంటే మరో పదేళ్లపాటు టీడీపీ జండాలను మోయాల్సిందేనని ఎక్కువమంది ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు దానిని మరో ఐదేళ్ల ను పొడిగించారు. పది నుంచి 15 ఏళ్లు అధికారం కోసం పోరాటం చేయడం తప్ప.. అధికారాన్ని చేపట్టేది లేదని పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు.
వాస్తవానికి ఏపీలో కూటమి అధికారంలోకి రాగానే పవర్ షేరింగ్ కోరుకున్నారు జనసైనికులు. ముఖ్యంగా సీఎం పదవిని రెండున్నర సంవత్సరాల పాటు చంద్రబాబు.. మరో రెండున్నర సంవత్సరాలు పవన్ కళ్యాణ్ చేపట్టాలని మెజారిటీ జనసైనికులు కోరుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు పూర్తిస్థాయిలో సీఎంగా ఉంటారని చెప్పడంతో పార్టీ శ్రేణులు నీరుగారిపోయాయి.
పవన్ తాజాగా చేసిన కామెంట్స్ తో జనసేన నాయకులు, కార్యకర్తలు మరోసారి అయోమయంలో పడ్డారు. 15 ఏళ్లు వైసీపీకి అవకాశం ఇవ్వమని చెప్పిన పవన్ కళ్యాణ్.. అధికారంలో ఉంటే సీఎం ఎవరనేది మాత్రం చెప్పడం లేదు. కోటమీ అధికారంలో ఉంటే చంద్రబాబు సీఎం గా ఉంటారు. ఇదే విషయాన్ని పవన్ సైతం చెప్పడం జరిగింది. దీనివల్ల జనసేనకు వచ్చే లాభం ఏంటని ఆ పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా ద్వేషిస్తున్నారు పవన్ కళ్యాణ్. కానీ దాని ద్వారా టిడిపికి పూర్తిస్థాయిలో బెండ్ అవుతున్నారు అన్నది సగటు జన సైనికుడి అభిప్రాయం. 11 సీట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దక్కాయి. కానీ 40 శాతం ఓటింగ్ తో ఆ పార్టీ ప్రజల్లో బలంగా ఉంది. అటువంటి పార్టీని నిర్వీర్యం చేయాలన్న ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నది కూడా పవన్ కళ్యాణ్ చూసుకోవాలి.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని నాశనం చేయాలని కోరుకుంటున్నా పవన్.. తన జనసేన మాత్రం విస్తరించలేకపోతున్నారు. ఇప్పటికీ ఆ పార్టీకి గ్రామస్థాయిలో బలం లేదు. పోల్ మేనేజ్మెంట్ పై కూడా పార్టీకి పెద్దగా అనుభవం లేదు. వాటిపై దృష్టి పెట్టకుండా ఇంకా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పతనం గురించి ఆలోచించడం తగదని జన సైనికులు మండిపడుతున్నారు. అధినేత తీరు మారాలని కోరుతున్నారు.