జగన్ 2.0 ను తట్టుకోలేరని.. తప్పకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తుందని జగన్మోహన్ రెడ్డి ఘంటాపదంగా చెబుతున్న సంగతి తెలిసిందే. జగన్ 1.0 ప్రజల కోసమని.. పార్టీ కోసమని స్పష్టమైన ప్రకటన చేసిన సంగతి విధితమే. ఒక పార్టీ అధినేతగా ఆయన నమ్మకం అది. కానీ ప్రముఖ సేఫలజిస్టులు సైతం జగన్మోహన్ రెడ్డి 2029 నాటికి బలమైన పునాదులతో అధికారంలోకి రావడం ఖాయమని తేల్చి చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో ఎంతటి ఓటమి ఎదురైందో.. అంతటి ఘనవిజయాన్ని 2029లో అందుకు పోతున్నారని స్పష్టం చేస్తున్నారు. దానికి కారణం కూటమి ప్రభుత్వం ప్రజల అంచనాలకు అందుకోలేకపోవడమే.
కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు పూర్తయింది. ఇంతవరకు సంక్షేమ పథకాలు ప్రారంభం కాలేదు. ప్రధానంగా సూపర్ సిక్స్ హామీల జోలికి వెళ్లలేదు. కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్నారు. ఇది ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తికి కారణమవుతోంది. ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై విపరీతమైన వ్యతిరేకత పెంచి కూటమి అధికారంలోకి రాగలిగింది. ఇప్పుడు అదే వ్యతిరేకత తాకిడి కూటమికి తగులుతోంది.
జగన్మోహన్ రెడ్డిని ఓడించాలన్న క్రమంలో అలవికాని హామీలు ఇచ్చేశారు. ఇప్పుడు ప్రతిపక్షం ప్రమేయం లేకుండానే ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి వ్యక్తం అవుతోంది. కూటమి ప్రభుత్వం తమ అంచనాలను తప్పిందని.. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వమే నయమన్న రీతికి ప్రజలు వస్తున్నారు. ఎంతవరకు రాజకీయ ప్రతీకారాలు, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప.. ఏమీ కనిపించడం లేదన్నది ప్రజల నుంచి వస్తున్న మాట.
ప్రముఖ సేఫలజిస్ట్ కేకే ఈ విషయంలో కుండ బద్దలు కొట్టినట్లు తేల్చేశారు. కూటమి ప్రభుత్వం అంచనాలకు అందుకోలేకపోయిందని.. జగన్ 2.0 ఉగ్రరూపం దాల్చ ఉందని తేల్చి చెప్పారు. 2029 ఎన్నికల్లో ఊహించని ఫలితాలు జగన్మోహన్ రెడ్డి సొంతం చేసుకోబోతున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా తమ చేపడుతున్న సర్వేలో ఇదే విషయం తేలిందన్నారు.
తిరుమలలో వివాదం నుంచి అన్ని రకాల వివాదాలు ప్రభుత్వం వాదన తేలిపోతోందని.. ప్రజలు అధికారం ఇచ్చింది పాలించమని.. కానీ వైయస్సార్ కాంగ్రెస్ నేతల అరెస్టు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తుందని తేల్చి చెప్పారు కేకే. దీనికి కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు కూడా.
సంక్షేమ పథకాలను ప్రజలు ఆశిస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి ప్రకటనలు మాత్రమే చేసిందని.. అవేవీ కార్యరూపం దాల్చలేని విషయాన్ని కేకే గుర్తు చేశారు. పైగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 40 శాతం ఓటు బ్యాంకు ఉందన్న విషయం మర్చిపోకూడదు అన్నారు. తటస్తులు మరోసారి వైయస్సార్ కాంగ్రెస్ వైపు వెళ్తే కూటమికి డిజాస్టర్ ఫలితాలు తప్పవని తేల్చి చెప్పారు. తాము రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సర్వే లో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని చెప్పారు కేకే. మొత్తానికి అయితే ఏడాది పాలన పూర్తి కాకమునుపే కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు అన్నమాట.