Tuesday, April 22, 2025

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి కీలక పదవి.. జగన్ ప్లాన్ అదే!

- Advertisement -

జగన్మోహన్ రెడ్డి పార్టీలో సమూల ప్రక్షాళనకు దిగారా? అనుబంధ విభాగాలపై దృష్టి పెట్టారా? అందులో భాగంగా యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. త్వరలో అనుబంధ విభాగాలకు కొత్త ప్రతినిధులు రానున్నట్లు తెలుస్తోంది.

గత ఐదేళ్లలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల నియామకాలు ఆశించిన స్థాయిలో జరగలేదు. ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాతో పాటు ఐ పాక్ టీం పై ఆధారపడ్డారు. దాంతో ఎంత నష్టం జరగాలో అంత జరిగింది. అనుబంధ విభాగాలతోనే పార్టీ బలోపేతం అవుతుందని తాజాగా గుర్తించారు జగన్మోహన్ రెడ్డి. అందుకే అనుబంధ విభాగాలను బలోపేతం చేయాలని చూస్తున్నారు.

త్వరలో జిల్లాల పర్యటనకు జగన్మోహన్ రెడ్డి సిద్ధపడుతున్న సంగతి తెలిసిందే. ఇంతలోనే అనుబంధ విభాగాల నియామకాలను పూర్తి చేయాలని చూస్తున్నారు. యువ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించేందుకు కసరత్తు చేస్తున్నారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో యువజన విభాగం కీలకం. అందుకే ఆ విభాగానికి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి సూత్రప్రాయంగా నిర్ణయించారని సమాచారం. ఇదే విషయాన్ని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చెప్పగా ఆయన సైతం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. మంచి వాగ్దాటి కలిగిన యువనేత కూడా. సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇప్పటికే యువజన విభాగంలో పనిచేసిన అనుభవం ఉంది. రానున్న నాలుగేళ్ల కాలంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా పోరాటాలు చేయాల్సి ఉంటుంది. అందుకే ఇప్పుడు అనుబంధ విభాగాల కు ప్రాధాన్యం ఏర్పడింది.

గత కొద్దిరోజులుగా పొలిటికల్గా సైలెంట్ గా ఉన్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. కానీ మొన్న ఆ మధ్యన పార్టీ ఇచ్చిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొని గళం ఎత్తారు. కూటమి ప్రభుత్వం విరుచుకుపడ్డారు. దీంతో బైరెడ్డి యాక్టివ్ కావడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎంతో సంతోషించాయి. ఇప్పుడు యువతన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలన్న జగన్మోహన్ రెడ్డి నిర్ణయం పై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!