Tuesday, April 22, 2025

రేషన్ కార్డులు ఎప్పుడు బాబూ!

- Advertisement -

ఏపీలో రేషన్ కార్డులకు ఈ కేవైసీ వ్యవహారం దుమారం రేపుతోంది.. లబ్ధిదారుల్లో టెన్షన్ పుట్టిస్తోంది. ఈ కేవైసీ పూర్తి చేయకపోతే రేషన్ కార్డులు తొలగిస్తారు అన్న ప్రచారం జరుగుతోంది. దీంతో లబ్ధిదారుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ఈ కేవైసీ కోసం మీసేవ, ఆధార్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు.

వాస్తవానికి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు మంజూరు ప్రక్రియ ప్రారంభం అవుతుందని అంతా భావించారు. కానీ అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది సమీపిస్తున్న కొత్త రేషన్ కార్డుల ఊసు లేదు. కానీ ఇప్పుడు ఈ కేవైసీ పేరు చెప్పి భారీగా రేషన్ కార్డులు తొలగిస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఎక్కువ మంది ఈ కేవైసీ చేయించేందుకు ముందుకు రావడం లేదు.

దాదాపు కూటమి అధికారంలోకి వచ్చిన నాటికి రేషన్ కార్డులకు సంబంధించి రెండు లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. గత ఏడాది కాలంలో మరో లక్ష దరఖాస్తులు సచివాలయాలకు వచ్చాయి. కానీ రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ మాత్రం జరగడం లేదు. దీంతో ప్రజల్లో ఒక రకమైన ఆందోళన ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి కనిపిస్తోంది.

వచ్చే నెల నుంచి సంక్షేమ పథకాలు ప్రారంభిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ప్రధానంగా అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం వంటి పథకాలకు శ్రీకారం చుట్టనుంది. సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులు కీలకంగా మారడంతో.. చాలామంది వద్ద లేకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు.

చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో చాలా రకాలుగా హామీలు ఇచ్చారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియను నిరంతరాయంగా కొనసాగిస్తామని చెప్పుకొచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి ఏడాది సమీపిస్తున్న ఒక్కసారి కూడా జారీ ప్రక్రియ చేపట్టలేదు. ఇది ప్రజల్లో విమర్శలకు కారణమవుతోంది. ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. లేకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!