Tuesday, April 22, 2025

వైయస్సార్ కాంగ్రెస్ లోకి కొలికపూడి.. ఏపీలో సంచలనం!

- Advertisement -

ఏపీలో సంచలన రాజకీయాలు నమోదు కాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అధికార పార్టీ నుంచి ఓ ఎమ్మెల్యే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని తెగ ప్రచారం నడుస్తోంది. గత కొంతకాలంగా తన చుట్టూ నడుస్తున్న వివాదాలతో విసిగి వేసారి పోయిన సదరు ఎమ్మెల్యే జగన్ తో సమావేశం కానున్నట్లు సమాచారం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి నుంచి అనుమతి వచ్చిందే తరువాయి ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని తేలిపోయింది. అదే జరిగితే ఏపీ రాజకీయాల్లో ఒక సంచలనమే.

గత కొంతకాలంగా టిడిపి హై కమాండ్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు. గెలిచింది మొదలు తిరువూరు నియోజకవర్గంలో టిడిపి శ్రేణులు ఆయనకు ఇబ్బంది పెడుతున్నాయి. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గ కావడంతో అప్పటివరకు వారు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్టు ఉండేది. అయితే స్వతంత్ర భావాలు.. ఆపై విద్యాధికుడు అయిన శ్రీనివాసరావు ఎమ్మెల్యే అయిననాటి నుంచి వారి పప్పులు ఉడకడం లేదు. అప్పటినుంచి వారు ఇబ్బందులు పెట్టడంతో కొలికపూడి ఆందోళనకు గురవుతున్నారు. ఎంతవరకు వారు చెప్పింది హై కమాండ్ వింటుందే తప్ప.. తన వెర్షన్ ఆలకించకపోవడంతో హై కమాండ్ తీరుపై కొలికపూడి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇక ఎంత మాత్రం టిడిపిలో ఉండడం శ్రేయస్కరం కాదని భావించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధపడుతున్నట్లు ప్రచారం సాగుతోంది.

అమరావతి ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చారు కొలికపూడి. అమరావతికి మద్దతుగా టీవీ డిబేట్లకు హాజరయ్యేవారు. ఈ క్రమంలో ఎల్లో మీడియా అధినేత చొరవతో ఆయన టిడిపికి దగ్గరయ్యారు. తిరువూరు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కావడంతో చివరి నిమిషంలో టిడిపి అభ్యర్థిగా మారారు. కూటమి వేవ్ తో గెలిచారు శ్రీనివాసరావు. కానీ గెలిచిన నాటి నుంచి తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు.

తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో అగ్రవర్ణ నాయకులు ఎక్కువగా ఉన్నారు. అక్కడ ఎమ్మెల్యేగా ఎవరు గెలిచినా వారిదే ఆధిపత్యం. కానీ కొలికపూడి విషయంలో అలా జరగలేదు. దానిని సహించలేకపోయారు ఎమ్మెల్యే శ్రీనివాసరావు. ఒక్కొక్కరిని నియంత్రిస్తూ వచ్చారు. అది టిడిపిలో అగ్రవర్ణ నేతలకు మింగుడు పడలేదు. అందుకే ఎమ్మెల్యే కోలికపూడి చుట్టూ వివాదాలు అల్లే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేను వివాదంలోకి నెట్టారు.

మొన్న ఆ మధ్యన టిడిపి క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరయ్యారు ఎమ్మెల్యే కొలికపూడి. పార్టీలో 135 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఎవరూ లేని పరిస్థితి తనకే ఎదురు కావడాన్ని జీర్ణించుకోలేకపోయారు. పైగా తన తప్పు లేదని చెప్పినా వినిపించుకోవడం లేదు హై కమాండ్. అందుకే దీనిని ఒక అవమానంగా భావిస్తున్నారు. మరోవైపు కృష్ణా జిల్లాలో ఇతర టిడిపి నేతలు ఎవరూ తనను పట్టించుకోవడంతో ఏకాకిగా మారారు. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఎలా ఉంటుందోనని తన అనుచరుల అభిప్రాయం కోరినట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో. ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆ పార్టీ ఎమ్మెల్యేలు 12 మంది అవుతారన్నమాట.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!