Wednesday, March 19, 2025

కొత్తపల్లి సుబ్బారాయుడు అసంతృప్తి స్వరం.. కాపు కార్పొరేషన్ చైర్మన్ పట్ల విముఖత!

- Advertisement -

కొత్తపల్లి సుబ్బారాయుడు అసంతృప్తితో ఉన్నారా? ఆయన ఎమ్మెల్సీ పదవి కోరుకుంటున్నారా? అందుకే కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేయడం లేదా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. ఈ ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు కొత్తపల్లి సుబ్బారాయుడు. నరసాపురం టికెట్ ఆశించారు. సమీకరణల్లో భాగంగా ఆయనకు చాన్స్ దక్కలేదు. అయినా సరే కూటమి గెలుపు కోసం కృషి చేశారు. కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో తనకు పెద్ద పదవి లభిస్తుందని అంచనా వేసుకున్నారు సుబ్బారాయుడు. కానీ కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి ప్రకటించేసరికి నిరాశకు గురయ్యారు. అందుకే ప్రమాణ స్వీకారం చేయలేదని ప్రచారం జరుగుతోంది.

తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు సుబ్బారాయుడు. వరుసగా నాలుగు సార్లు నరసాపురం అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. 1989, 1994, 1999, 2004లో వరుసగా నరసాపురం నియోజకవర్గం నుంచి గెలిచారు. చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే రాజకీయంగా తీసుకున్న నిర్ణయాలతో ఇబ్బందులు పడ్డారు.

అయితే 1996లో అనూహ్యంగా పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం ఏర్పాటు చేయడంతో ఆ పార్టీలో చేరారు. కానీ ఆ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. పిఆర్పి కాంగ్రెస్లో విలీనం కావడంతో సుబ్బారాయుడు సైతం కాంగ్రెస్ గూటికి చేరారు. 2012 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి అనూహ్య విజయం దక్కించుకున్నారు.

2014 ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ గూటికి చేరారు సుబ్బరాయుడు. కానీ ఆ ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. కానీ టిడిపి అధికారంలోకి రావడంతో కాపు కార్పొరేషన్ పదవి దక్కింది. కానీ 2019 ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు సుబ్బారాయుడు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సైతం టికెట్ దక్కలేదు. అక్కడ కూడా కాపు కార్పొరేషన్ పదవితో సరిపెట్టారు. దీంతో అసంతృప్తి గానే ఉన్న ఆయన 2022లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడంతో సస్పెన్షన్ వేటు పడింది. అటు తరువాత ఈ ఎన్నికలకు ముందు జనసేనలో చేరారు కొత్తపల్లి సుబ్బారాయుడు. పార్టీ కోసం కష్టపడ్డారు కూడా.

అయితే నామినేటెడ్ పదవుల ప్రకటనలో సుబ్బారాయుడుకు కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. అయితే కాపు కార్పొరేషన్ తో తనపై కులముద్ర పడుతుందని సుబ్బారాయుడు భావిస్తున్నారు. పైగా ఎమ్మెల్సీగా వెళ్లాలని ఎక్కువగా కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు నాగబాబు రూపంలో కొత్తపెళ్లి సుబ్బారాయుడు కు ఇబ్బందికరంగా మారింది. అందుకే కొద్దిరోజుల పాటు మౌనం పాటించాలని భావిస్తున్నారు. అయితే కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి తీసుకోకూడదని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!