Wednesday, March 19, 2025

లోకేష్ తీరుతో పార్టీలో తిరుగుబాటు.. టిడిపి సీనియర్ల హెచ్చరిక!

- Advertisement -

తెలుగుదేశం పార్టీలో అడ్డగోలుగా చీలిక కనిపిస్తోంది. ముఖ్యంగా సీనియర్లు వర్సెస్ జూనియర్లు అన్నట్టు పరిస్థితి మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే లోకేష్ టీం వర్సెస్ పాత నేతలు. ఎమ్మెల్సీ పదవుల్లో ఎక్కువ తన టీముకు ఇవ్వాలని లోకేష్ కోరుతున్నారట. అలా చేస్తే తనకు ఇబ్బందులు తప్పవని చంద్రబాబు భావిస్తున్నారట. అందుకే కుమారుడు లోకేష్ ను సముదాయించే ప్రయత్నం చేశారట.

ఎమ్మెల్యేల కోట కింద 5 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎన్నిక ఈనెల 20న జరగనుంది. జనసేనకు ఒక పదవి కేటాయించడంతో నాగబాబుకు ఖరారు అయింది. అయితే మిగతా నాలుగు పదవుల కోసం ఆశావహులు ఓ పాతికమంది పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో గతంలో టిక్కెట్లు త్యాగం చేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. లేకుంటే పార్టీ క్యాడర్ కు తప్పుడు సంకేతాలు వెళ్తాయని చంద్రబాబు భయపడుతున్నారట.

మరోవైపు పార్టీతో పాటు ప్రభుత్వంలో తన ప్రాబల్యం పెంచుకోవాలని లోకేష్ భావిస్తున్నారు. అందుకే తన టీంకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే రాజ్యసభ పదవి విషయాల్లో ఆయన తన మాట నెగ్గించుకున్నారు. సనా సతీష్ వంటివారికి రాజ్యసభ పదవి ఇవ్వడం అందులో భాగమే.

అయితే తాజాగా మిగిలిన నాలుగు ఎమ్మెల్సీ పదవుల్లో బుద్ధ వెంకన్న, దేవినేని ఉమామహేశ్వరరావు, కొమ్మాలపాటి శ్రీధర్ లాంటి నేతలు పదవి అడుగుతున్నారు. మరువైపు గత కొద్దిరోజులుగా లోకేష్ ను అనుసరిస్తున్న వంగవీటి రాధాకృష్ణ లాంటి నేతలు కూడా ఎదురుచూస్తున్నారు. వీరందరికీ ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలని చంద్రబాబుపై లోకేష్ ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం.

అయితే లోకేష్ విషయంలో దూర దృష్టితో ఆలోచిస్తున్నారు చంద్రబాబు. మరోవైపు సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీగా పదవీ విరమణ చేశారు. ఆయనను రెన్యువల్ చేసి మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటున్నారు. అయితే దీనికి లోకేష్ అంగీకరించడం లేదట. అదే విషయం తెలిసి యనమల రామకృష్ణుడు చాలా బాధపడుతున్నారట. చంద్రబాబు ఇంతటి ఉన్నతికి తానే కారణమని.. నాడే స్పీకర్ గా నిర్ణయం తీసుకోకుంటే చంద్రబాబు పరిస్థితి ఏంటని అనుచరుల వద్ద యనమల బాధపడుతున్నారట. లోకేష్ పెత్తనం పార్టీలో పెరుగుతోందని.. అది ఎంత మాత్రం మంచిది కాదని.. ఏదో ఒక రోజు తిరుగుబాటు ఖాయమని యనమల హెచ్చరిస్తున్నట్లు సమాచారం. మొత్తానికైతే టిడిపిలో ఎమ్మెల్సీల పదవి ఎంపిక కొత్త రగడకు దారి తీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!