పేరుకే ఆయన ఎమ్మెల్యే.. పెత్తనమంతా ఆ సామాజిక వర్గానిదే. వారి సిఫారసులకు పెద్దపీట వేయాలి. వారు చెప్పిన పని చేసి పెట్టాలి. వారు పని చేయమన్న వారికి చేయాలి. లేకుంటే ఇబ్బందికరమే. అయితే ఇంతకీ ఏదాన నియోజకవర్గం? ఎవరా ఎమ్మెల్యే? తెలియాలంటే వాచ్ థిస్ స్టోరీ.
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం. ఆ నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు డాక్టర్ వీఎం థామస్. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో డిప్యూటీ సీఎం గా ఉన్న కే నారాయణస్వామి కుమార్తె కృపా లక్ష్మిపై భారీ ఓట్ల తేడాతో గెలుపొందారు థామస్. అయితే గెలిచిన నాటి నుంచి కమ్మ సామాజిక వర్గం ఆధిపత్యం ఎక్కువైంది. వారు చెప్పిందే చేయాలి. లేకుంటే కష్టం.
అయితే విద్యాధికుడు అయిన థామస్ ఇటీవల అన్ని వర్గాల ప్రజలకు ప్రాధాన్యమిస్తున్నారు. నియోజకవర్గంలో ఇతర సామాజిక వర్గానికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తుండడంతో కమ్మ సామాజిక వర్గం జీర్ణించుకోలేకపోయింది. ఒకరిద్దరు నేతలు ఎమ్మెల్యే థామస్ పై ఏకంగా సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రబాబు ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. ఇటీవల గంగాధర నెల్లూరు నియోజకవర్గ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు.
అక్కడ ఎర్రచందనం, ఇసుక స్మగ్లర్స్ తో ఎమ్మెల్యే థామస్ చేతులు కలిపారని కమ్మ సామాజిక వర్గం నేతలు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో ఎమ్మెల్యే థామస్ సైతం కమ్మ సామాజిక వర్గం నేతల ఆగడాలను వివరించే ప్రయత్నం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ నేతలతో చేతులు కలిపిన వైనాన్ని వివరించగలిగారు. దీంతో చంద్రబాబు ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. ఇక్కడి పరిస్థితులు తెలుసునని.. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో గంగాధర నెల్లూరు జిల్లా నియోజకవర్గ వ్యవహార శైలి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతుంది.