Sunday, March 16, 2025

బాలకృష్ణ హ్యాట్రిక్ ఎమ్మెల్యే.. నాగబాబు ఎమ్మెల్సీ టు మంత్రి.. నందమూరి అభిమానులు ఫైర్!

- Advertisement -

నందమూరి కుటుంబానికి ప్రత్యేక చరిత్ర. వెండితెరపై ఒక వెలుగు వెలిగారు నందమూరి తారక రామారావు. రాజకీయాల్లో కూడా రాణించారు. పార్టీ పెట్టి అనతికాలంలోనే అధికారంలోకి రాగలిగారు. అటు తరువాత సినీ రంగం నుంచి రాణించిన కుటుంబం మాత్రం కొణిదల వారి కుటుంబం. అయితే నందమూరి కుటుంబం నుంచి ఎన్టీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. కొణిదల కుటుంబం నుంచి చిరంజీవి కేంద్ర మంత్రి అయ్యారు. మరోవైపు నందమూరి కుటుంబం నుంచి హరికృష్ణ మంత్రిగా కొద్దిరోజుల పాటు పదవి చేపట్టారు. బాలకృష్ణ హిందూపురం నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచారు. అదే కొణిదల కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నిక కానున్నారు. తరువాత మంత్రి పదవి చేపట్టనున్నారు. అయితే ప్రస్తుత రాజకీయాల్లో కొణిదల కుటుంబం నందమూరి కుటుంబం కంటే విశేషమైన ప్రభావం చూపుతోంది.

కొణిదల కుటుంబానికి చెందిన నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నిక లాంఛనమే. తరువాత ఆయన మంత్రిగా కూడా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే ఈ లెక్కన నందమూరి కుటుంబానికి అన్యాయం జరిగిందన్న టాక్ వినిపిస్తోంది. ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని నాగబాబు నేరుగా మంత్రి అవుతున్నారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్న నందమూరి బాలకృష్ణ మాత్రం సాధారణ శాసనసభ్యుడిగా మిగిలిపోయారు. ఇది ముమ్మాటికి నందమూరి కుటుంబానికి సిగ్గుచేటు విషయం.

సినీ రంగంలో నందమూరి వర్సెస్ కొణిదల కుటుంబం అన్నట్టు పరిస్థితి ఉండేది. ఒక విధంగా 2009లో తెలుగుదేశం పార్టీ ఓటమికి ప్రజారాజ్యం పార్టీ పనిచేసింది. అప్పటినుంచి కొణిదల కుటుంబం పై తెలుగుదేశం పార్టీకి ఒక రకమైన భిన్నాభిప్రాయం ఉండేది. కానీ 2014 ఎన్నికల్లో నేరుగా టిడిపికి మద్దతు తెలిపారు పవన్ కళ్యాణ్. తద్వారా అప్పటివరకు కొణిదల కుటుంబం పై ఉన్న అభిప్రాయం కొంతవరకు మారింది టిడిపి శ్రేణుల్లో. అయితే మెగా బ్రదర్ నాగబాబు మాత్రం నందమూరి బాలకృష్ణ విషయంలో సెటైరికల్ గా మాట్లాడేవారు. అసలు బాలయ్య అనే వ్యక్తి తనకు తెలియదని ఎద్దేవా చేసిన సందర్భాలు ఉన్నాయి. అసలు బాలకృష్ణకు వ్యవహార శైలి రాదు అని కూడా పరోక్ష విమర్శలు చేసేవారు. అటువంటి నాగబాబుకి ఇప్పుడు మంత్రి పదవి లభిస్తుండడం బాలకృష్ణకు మింగుడు పడని అంశం.

నందమూరి కుటుంబంలో చివరిసారిగా మంత్రి పదవి చేపట్టింది హరికృష్ణ. ఉమ్మడి రాష్ట్రంలో మూన్నాళ్ళ ముచ్చటగా ఆ పదవి చేపట్టారు హరికృష్ణ. 1999 ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు హరికృష్ణను దూరం పెట్టారు. అసలు నందమూరి కుటుంబం నుంచి ఒక్కరికి కూడా అవకాశం లేదు. అయితే కొణిదల కుటుంబంలో ఇప్పటికే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్నారు. అయితే ఇప్పుడు అర్జెంటుగా నాగబాబును ఎమ్మెల్సీ చేసి మంత్రిగా చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇది నందమూరి కుటుంబానికి ఇబ్బంది కలిగించే విషయం. ఆ కుటుంబ అభిమానుల్లో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!