Wednesday, March 19, 2025

తీరు మార్చుకోని సిక్కోలు వైసీపీ సీనియర్లు!

- Advertisement -

శ్రీకాకుళం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ల వ్యవహార శైలి ఏ మాత్రం మింగుడు పడడం లేదు. అసలు వారు పార్టీలో ఉంటారా? ఉండరా? అనేది కూడా తెలియడం లేదు. వారు పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. కార్యకలాపాల్లో పంచుకోవడం లేదు. అలాగని పార్టీకి రాజీనామా చేయడం లేదు. దీంతో వారి విషయంలో హై కమాండ్ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. తాజాగా ఉత్తరాంధ్ర నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితులైన కురసాల కన్నబాబు శ్రీకాకుళం వెళ్లి సమావేశం ఏర్పాటు చేశారు. కానీ ఆ ఇద్దరు నేతలు గైర్హాజరయ్యారు. దీంతో వారి వ్యవహార శైలి చర్చనీయాంసం గా మారింది.

2024 ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. ఓ ద్వితీయ శ్రేణి నాయకుడి చేతిలో ఓడిపోయారు. అప్పటినుంచి ఫుల్ సైలెంట్ పాటిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు సైతం హాజరు కావడం లేదు. పోనీ ఆయన స్థానంలో కొత్త వారిని నియమిస్తామంటే క్యాడర్ ఒప్పుకోవడం లేదు. దీంతో ధర్మాన ప్రసాదరావు కోసం పార్టీ ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తమ్మినేని సీతారాం ది అదే పరిస్థితి. ఆమదాలవలస నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయనకు ఓటమి ఎదురయింది. దీంతో నియోజకవర్గ ఇన్చార్జిగా ఆయన స్థానంలో ద్వితీయ శ్రేణి నాయకుడిని తెరపైకి తెచ్చారు జగన్మోహన్ రెడ్డి. సీతారాంను పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించారు. అయితే ఆ పదవి ఇష్టం లేదు తమ్మినేని సీతారాంకు.

అయితే ఇద్దరు నేతలు సీనియర్లు. శ్రీకాకుళం జిల్లాలో బలమైన సామాజిక వర్గాలకు చెందినవారు. జిల్లావ్యాప్తంగా ప్రభావం చూపగలరు. అందుకే వీరి విషయంలో హై కమాండ్ సైతం కాస్త ఆలోచనతో ముందుకు సాగుతోంది. అయితే ఆ ఇద్దరు నేతలు తమ వారసుల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ఎన్నికలకు ముందు పార్టీ మారే విషయంలో ఆలోచిద్దామని భావిస్తున్నారు.

ధర్మాన ప్రసాదరావు జిల్లా వ్యాప్తంగా పట్టున్న నేత. కానీ జిల్లా కేంద్రంలో మాత్రం దారుణంగా ఓడిపోయారు. టిడిపికి చెందిన ఓ సాధారణ ద్వితీయ శ్రేణి నాయకుడు చేతిలో ఓటమి చవిచూశారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగాల? వద్దా? అన్న ఆలోచనలో ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మాత్రం ధర్మాన ప్రసాదరావు ఉంటేనే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. ఆయన మాత్రం పార్టీలో యాక్టివ్ కావడం లేదు.

తమ్మినేని సీతారాం వ్యవహార శైలి కూడా అలానే ఉంది. తన కుమారుడు కాకుండా వేరే ఎవరైనా ఇన్చార్జిగా ఉంటే ఆయన సహించడం లేదు. తన కుమారుడు చిరంజీవి నాగ్ కు నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించాలని కోరుకున్నారు. కానీ చింతాడ రవికుమార్ అనే వ్యక్తికి ఇన్చార్జిగా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే తమకు భవిష్యత్తు లేదని తమ్మినేని భావిస్తున్నారు. అలాగని పార్టీకి రాజీనామా చేయడం లేదు. చివరిదాకా వేచి చూడాలని భావిస్తున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!