Wednesday, March 19, 2025

కూటమి నెక్స్ట్ టార్గెట్ వారిద్దరే.. ఏపీలో రెడ్బుక్ సంస్కృతి!

- Advertisement -

ఏపీలో రెడ్బుక్ సంస్కృతి నడుస్తోంది. వరుసగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసులు నమోదవుతున్నాయి. అరెస్టుల పర్వం నడుస్తోంది. ఇప్పటికే వల్లభనేని వంశీ మోహన్ అరెస్టయ్యారు. పోసాని కృష్ణ మురళి సైతం వరుసగా కేసులకు గురయ్యారు. చివరకు ఎలాగోలా ఆయనకు బెయిల్ లభించింది. దీంతో నెక్స్ట్ ఎవరన్నది ఇప్పుడు ప్రశ్న. మొన్నటికి మొన్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు విచారణకు పిలిచారు. కానీ అరెస్టు జరగలేదు. దీంతో తదుపరి అరెస్ట్ ఎవరిది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

అయితే కూటమి ప్రభుత్వంతో పాటు టిడిపి శ్రేణులు ఎక్కువగా ఎదురుచూస్తోంది మాజీమంత్రి కొడాలి నాని అరెస్టు కోసం. ఇప్పటికే నాని మంత్రిగా ఉన్నప్పుడు అవకతవకలపై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. ముఖ్యంగా గుడివాడలో భూకబ్జా ఆరోపణలు, దౌర్జన్యాలు, దాడుల కోసం ఆరా తీస్తోంది.

గతంలో కొడాలి నాని గుడివాడలో ప్రతి సంక్రాంతికి కేసినో నిర్వహించేవారు. జూద శిబిరాలు నిర్వహించేవారు అని కూటమి పార్టీలు ఆరోపణలు చేసేవి. ఇప్పుడు ఆ దిశగా కేసులు నమోదు చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వల్లభనేని వంశీ అరెస్టు మాదిరిగానే కొడాలి నానిని అరెస్టు చేసి.. కేసులు మీద కేసులు పెట్టాలన్నది కూటమి ప్రభుత్వ ప్లాన్ గా తెలుస్తోంది.

మాజీ మంత్రి రోజా విషయంలో సైతం కూటమి ప్రభుత్వం దూకుడుగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఆమె క్రీడల శాఖ మంత్రిగా ఉండేటప్పుడు ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ సమయంలో 109 కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే విజయవాడకు చెందిన ఓ వ్యక్తి దీనిపై ఫిర్యాదు చేశారు. దీంతో కూటమి ప్రభుత్వం రోజాపై సైతం ఫుల్ ఫోకస్ పెట్టినట్లు ప్రచారం నడుస్తోంది.

కొడాలి నానితో పాటు రోజా గతంలో చంద్రబాబుతో పాటు లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. ఎక్కువగా వ్యక్తిగత కామెంట్లకు దిగేవారు. వీటిపై సైతం పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. మంత్రులుగా వారు చేసిన అవినీతితో పాటు అనుచిత కామెంట్లను సైతం పరిగణలోకి తీసుకొని వరుసుగా కేసులతో ఉక్కు పాదం మాపాలన్నది ప్లాన్. అయితే అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!