Friday, May 2, 2025

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి?

- Advertisement -

నెల్లూరు జిల్లా అంటే ముందుగా గుర్తొచ్చేది మేకపాటి కుటుంబం. జిల్లా రాజకీయాల్లో ఆ కుటుంబానికి ఎనలేని ప్రాధాన్యం ఉంది. పెద్దాయన మేకపాటి రాజమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలుగు గారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సైతం బలమైన ముద్ర చాటుకున్నారు. ప్రస్తుతం అదే పార్టీలో ఉన్నారు. అయితే ఆయన సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి మాత్రం తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. కానీ అక్కడ తగినంత ప్రాధాన్యత లేకపోవడంతో యూటర్న్ తీసుకోవాలని భావిస్తున్నారు.

బాలినేని కుటుంబంలో రాజమోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, గౌతమ్ రెడ్డి, విక్రం రెడ్డి ఇలా అందరూ ప్రజా ప్రతినిధులుగా రాణించారు. అయితే ఆ కుటుంబానికి రాజశేఖర్ రెడ్డి అత్యంత ప్రాధాన్యం ఇవ్వగా.. జగన్మోహన్ రెడ్డి సైతం అదే అభిమానాన్ని కొనసాగిస్తూ వచ్చారు.

నెల్లూరు జిల్లాలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో జరిగిన పరిణామాలతో కలత చెందారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని విభేదించారు. తెలుగుదేశం పార్టీలో చేరారు. కానీ అక్కడ తగినంత ప్రాధాన్యత దక్కలేదు. కనీసం ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎటువంటి ప్రాధాన్యత లేదు. దీంతో చంద్రశేఖర్ రెడ్డి మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఆహ్వానిస్తే తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది.

సోదరుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు చంద్రశేఖర్ రెడ్డి. 1999లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2004, 2009లో మాత్రం వరుసగా గెలిచారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు.

సీనియర్ ఎమ్మెల్యేగా చంద్రశేఖర్ రెడ్డి పట్ల జగన్మోహన్ రెడ్డి ఎంతో అభిమానం చూపేవారు. కేవలం నెల్లూరు జిల్లా రాజకీయాలు, కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో విభేదాలు తలెత్తాయి. సరి చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి సూచించడంతో అసంతృప్తికి గురయ్యారు చంద్రశేఖర్ రెడ్డి.

2023 మార్చిలో ఎమ్మెల్యేల కోట కింద ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేశారు చంద్రశేఖర్ రెడ్డి. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్కు గురయ్యారు. అయితే చంద్రశేఖర్ రెడ్డి తో పాటు టిడిపిలో చేరిన వారందరికీ టిక్కెట్లు లభించాయి. కానీ చంద్రశేఖర్ రెడ్డి విషయంలో మాత్రం చంద్రబాబు మొండి చేయి చూపారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కనీస స్థాయిలో కూడా నామినేటెడ్ పదవి దక్కలేదు. భవిష్యత్తులో పదవి ఇస్తారన్న గ్యారెంటీ లేదు. అందుకే తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు చంద్రశేఖర్ రెడ్డి మొగ్గు చూపుతున్నారు. జగన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని తెలుస్తోంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!