Sunday, March 16, 2025

దారి తప్పుతున్న ఎల్లో మీడియా కథనాలు.. ఐఏఎస్ భార్యలను వదలరా!

- Advertisement -

ఏపీలో మీడియాది వింత పోకడ. ముఖ్యంగా ఎల్లో మీడియా గురించి చెప్పనవసరం లేదు. వాటికి తెలుగుదేశం ప్రయోజనాలే ముఖ్యం. చంద్రబాబు ప్రయోజనాలే అత్యంత కీలకం. అందుకోసం ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధపడుతుంది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. కానీ ఒక సామాజిక వర్గం నేతలపై ఒకలా.. ఇంకో సామాజిక వర్గం పై మరోలా వ్యవహరిస్తోంది ఎల్లో మీడియా.

మూడు పార్టీలు కూటమి కట్టాయి. ఉమ్మడి ప్రభుత్వం నడుస్తోంది. చంద్రబాబు సారథ్యం వహిస్తున్నారు. కానీ ఎక్కడ టిడిపికి ఇబ్బంది రాకుండా చూస్తోంది ఎల్లో మీడియా. మరి తెలుగుదేశం పార్టీపై రాయాలనుకుంటే.. కొన్ని సామాజిక వర్గాల ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా కథనాలు రాస్తోంది. కానీ చంద్రబాబుతో పాటు కమ్మ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు, మంత్రుల జోలికి మాత్రం పోవడం లేదు.

ప్రభుత్వంలో అధికారులు ఒక భాగం. విధానపరమైన నిర్ణయాలు తీసుకునేది ప్రభుత్వం. దానిని అమలు చేసేది యంత్రాంగం. కానీ ప్రజాప్రతినిధులు చేసే తప్పిదాలను.. యంత్రాంగం పై మోపుతుండడం ఎల్లో మీడియాకు ప్రత్యేకం. ఇక్కడ టిడిపి ఎమ్మెల్యేలు,మంత్రులు తప్పులు చేయడం లేదట. చేస్తున్నది అధికారులేనట. ప్రభుత్వాన్ని ఒకవైపు పొగుడుతూ రాస్తూనే.. ప్రభుత్వాన్ని నడిపించే అధికారులను దోపిడీదారులుగా చూపించే ప్రయత్నం చేస్తోంది ఎల్లో మీడియా.

రెండు రోజుల కిందట ఐఏఎస్ అధికారుల భార్యల తీరుపై ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది. ఈనెల 11న మేడం సార్.. మేడం సర్ అంటే అనే శీర్షికతో ఆంధ్రజ్యోతిలో ఒక కథనం ప్రచురితం అయింది. సీనియర్ ఐఏఎస్ అధికారుల భార్యల దందాపై కథనం ఉంది. చంద్రబాబు పాలనను పొగుడుతూనే.. ఐఏఎస్ అధికారుల భార్యలను కించపరుస్తూ రాసిన ఈ కథనం సంచలనం రేకెత్తించింది.

అయితే ప్రభుత్వంలో ఉండేది ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు. అవినీతి జరిగేది వారి వద్ద. కానీ అది మరిచి ఆంధ్రజ్యోతిలో ఐఏఎస్ భార్యలపై వచ్చిన కథనం మాత్రం ఉన్నత వర్గాల్లో విస్మయం రేపింది. అధికారిక వర్గాల్లో ఆగ్రహం రేపుతోంది. ఇది ముమ్మాటికి కట్టు కథనాలు అని.. ప్రభుత్వం మంచిది అయితే.. అందులో పనిచేసే అధికారులు కూడా మంచివారే కదా. కానీ చిన్నపాటి లాజిక్ ను మరిచి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గమ్మత్తైన కథనాలు రాస్తున్నారు. ప్రజల్లో పలుచన అవుతున్నారు.

అయితే సీనియర్ ఐఏఎస్ ల భార్యలపై ఆంధ్రజ్యోతి రాసిన కథనం సంచలనం రేకెత్తించింది. దీనిపై పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే రాసింది తన అస్మదీయ పత్రికలో. మరి చంద్రబాబు ఏం చేస్తారు. ఎటువంటి చర్యలు తీసుకుంటారు. ఆ ఫిర్యాదు అనేది బొత్తిగా వేస్ట్.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!