Wednesday, March 19, 2025

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొత్త నియామకాలు

- Advertisement -

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి ప్రక్షాళనకు దిగారు జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలామంది నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. విజయసాయి రెడ్డి లాంటి కీలక నేత సైతం పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్లిపోయారు. రాజ్యసభ సభ్యులతో పాటు ఎమ్మెల్సీలు సైతం తమ పదవులను వదులుకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రి పదవులు అనుభవించిన వారు సైతం రకరకాల ప్రలోభాలకు గురై పార్టీని వీడారు. చాలామంది మాజీ ఎమ్మెల్యేలు సైతం సేఫ్ జోన్ చూసుకున్నారు. ఫలితంగా పార్టీకి ఇబ్బందులు తప్పలేదు. అయితే వాటన్నింటినీ అధిగమించే పనిలో పడ్డారు జగన్మోహన్ రెడ్డి. ఇలా నేతలు గుడ్ బై చెబుతుండడంతో ఖాళీ అయిన పదములను అంతే వేగంగా భర్తీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి.

ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ గా విజయసాయిరెడ్డి ఉండేవారు. ఆయన రాజీనామాతో ఆ పదవి ఖాళీ అయింది. దానిని మాజీ మంత్రి కురసాల కన్నబాబును నియమించారు. చాలామంది ఆశావహుల పేర్లు వినిపించాయి. కానీ చివరకు కన్నబాబు పేరును ఖరారు చేశారు. అయితే అంతే వేగంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఖాళీ అయిన పదవులను భర్తీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా అనంతపురం జిల్లాకు చెందిన చిట్లూరు రమేష్ గౌడ్, కడప జిల్లాకు చెందిన రాచమల్లు రవిశంకర్ రెడ్డి పేర్లను ఖరారు చేశారు. వీరిద్దరూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు. అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు కూడా. వీరి నియామకంతో పార్టీ బలోపేతం అవుతుందని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.

ఇంకోవైపు గుంటూరు జిల్లాలో పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు జగన్మోహన్ రెడ్డి. కొద్దిరోజుల కిందట గుంటూరు పార్లమెంటరీ ఇన్చార్జిగా మాజీమంత్రి అంబటి రాంబాబును నియమించారు. సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్చార్జిగా అంబటి రాంబాబు ఉండేవారు. గత మూడు ఎన్నికల్లో అదే నియోజకవర్గ నుంచి బరిలో దిగారు అంబటి రాంబాబు. ఈ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత గుంటూరు జిల్లా నుంచి మెజారిటీ నేతలు బయటకు వెళ్లిపోయారు. ఈ తరుణంలో అంబటి రాంబాబుకు గుంటూరు పార్లమెంట్ బాధ్యతలను అప్పగించారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు తాజాగా గుంటూరు విషయంలో మరో నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు వైసిపి నగర అధ్యక్షురాలిగా షేక్ నూర్ ఫాతిమాను నియమించారు. గుంటూరులో ముస్లిం మైనారిటీల సంఖ్య అధికం కావడంతో ఆమె ఎంపికపై హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

ఉగాది నుంచి ప్రజల్లోకి రావాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అంతకు ముందే ఉమ్మడి జిల్లాల వారీగా స్థానిక ప్రజా ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు. ఎంపీపీలు,జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ వైస్ చైర్మన్లు, చైర్మన్లు, డిప్యూటీ మేయర్లు, మేయర్లతో వరుస పెట్టి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల పరిస్థితులను తెలుసుకుంటున్నారు. పార్టీ కోసం పని చేసే నేతల గురించి ఆరా తీస్తున్నారు. అందులో భాగంగానే కొత్త నేతలు నియామకాలు చేపడుతున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!