Sunday, March 16, 2025

మారిన జగన్మోహన్ రెడ్డి వైఖరి.. కావాల్సింది ఇదేనంటున్న వైసీపీ శ్రేణులు!

- Advertisement -

వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి దూకుడు పెంచారు. గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. గతంలో కొన్ని అంశాలపై స్పందించేటప్పుడు జాప్యం జరిగేది. ఇప్పుడు మాత్రం ఏదైనా ఘటన జరిగినప్పుడు ఇట్టే స్పందిస్తున్నారు. వల్లభనేని వంశీ అరెస్టుతో పాటు మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరిపై కేసుల నమోదు విషయంలో స్పందించారు జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. వారిద్దరికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబు సర్కార్ పై తీవ్రస్థాయిలో ధ్వజం ఎత్తారు.

ప్రధానంగా వల్లభనేని వంశీ మోహన్ పై నమోదైన కేసు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. ఇటువంటి తరుణంలో పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ దళిత యువకుడు వల్లభనేని వంశీ మోహన్ తప్పిదం లేదని వాంగ్మూలం ఇచ్చారు. కానీ అలా వాంగ్మూలం ఇచ్చిన తరువాత ఆ దళిత యువకుడి ఇంటిపై దాడి చేశారు టిడిపి నేతలు. కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేశారు. అదే విషయాన్ని గుర్తు చేశారు జగన్మోహన్ రెడ్డి. వాంగ్మూలం ఇచ్చిన దళిత యువకుడిని భయపెట్టి.. వల్లభనేని వంశీ మోహన్ కు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇప్పించుకున్నారని సంచలన విషయాన్ని బయటపెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఒక కేసులో అరెస్టు చేసి.. 16 కేసులను వల్లభనేని వంశీ పై పెట్టడం చూస్తుంటే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఏ స్థాయిలో అమలు చేస్తున్నారు అర్థమవుతోందని చెప్పుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి.

ఇంకోవైపు వైసిపి మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయడానికి తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు జగన్మోహన్ రెడ్డి. ఓ ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో అబ్బాయి చౌదరి కారు డ్రైవర్ పై చింతమనేని ప్రభాకర్ ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో లక్షలాదిమంది ప్రజలు చూశారని.. బూతులతో తిట్ల దండకం అందుకున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ చూశారని.. కానీ తిరిగి అబ్బయ్య చౌదరి పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం ఏంటని ఆందోళన వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వంలో శాంతిభద్రతలు క్షీణించాయని చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణలు ఏమి ఉన్నాయని ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి.

అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గతానికి భిన్నంగా వ్యవహరిస్తుండడాన్ని ఆ పార్టీ శ్రేణులు ఆహ్వానిస్తున్నాయి. ఈ రెండు ఘటనలు జరిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి స్పందించిన తీరుపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపే ప్రయత్నాన్ని చేస్తున్న అధినేత తీరును సీనియర్లు సైతం అభినందిస్తున్నారు. ఆయనలో పాత జగన్మోహన్ రెడ్డి కనిపిస్తున్నారని చెబుతున్నారు. ఇదే దూకుడు కొనసాగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క నేత కూడా బయటకు వెళ్ళరని.. పైగా పార్టీలో ఉంటూ గట్టి పోరాటమే చేస్తారని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!