ఆంధ్రప్రదేశ్లో టిడిపి కూటమి ప్రభుత్వం దూకుడుగా ముందుకు సాగుతోంది. అంతా పారదర్శక పాలన అని చెబుతున్నా.. ఎక్కడికక్కడే ప్రజాస్వామ్యానికి ఖూనీ చేసేలా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలకు ఓ నాలుగు మీడియా ఛానళ్లకు అనుమతి ఇవ్వకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సాక్షి, టీవీ9, ఎన్టీవీ, 10 టీవీ ఛానల్ కు సంబంధించిన రిపోర్టర్లకు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. ఆ నాలుగు ఛానల్ కు సంబంధించిన రిపోర్టర్లకు అసెంబ్లీ పాసులు ఇవ్వలేదని సమాచారం. దేశంలో మరే రాష్ట్రంలో లేని దుస్సాంప్రదాయాన్ని కూటమి ప్రభుత్వం వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న చానళ్లపై కక్ష సాధింపు చర్యకు దిగడం నిజంగా దురదృష్టకరం. పైగా దీనిని టిడిపి కూటమి శ్రేణులు సమర్ధిస్తుండడం విచారకరం.
తెలుగుదేశం పార్టీకి బలమైన మీడియా మద్దతు ఉంది. ఇది బహిరంగ రహస్యం కూడా. అయితే ఇప్పుడు తమకు వ్యతిరేకం అని భావించిన ఛానళ్లను అసెంబ్లీలోకి అనుమతి ఇవ్వకపోవడం నిజంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. సమర్థవంతమైన పాలన అందిస్తున్నామని సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటిస్తూ వచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. మీడియాను నియంత్రించడం ఏంటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అనుకూల మీడియా అయితే ఒకలా.. వ్యతిరేక మీడియా అయితే మరోలా వ్యవహరించడం ఏంటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ప్రధానంగా ఎల్లో మీడియా ఇప్పుడు హైలెట్ అవుతోంది.
మొన్నటి వరకు ప్రభుత్వ ప్రకటనలు తమకు ఇవ్వలేదని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి గోష పెట్టింది. కానీ ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా ఫుల్ పేజీ యాడ్లు ఆంధ్రజ్యోతి లభిస్తున్నాయి. భారీగా దోచిపెట్టె కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అయితే ప్రభుత్వ ప్రకటనలు సాక్షితో పాటు ఇతర మీడియాలకు లభించడం లేదు. కనీసం శాసనసభ సమావేశాలను కవర్ చేస్తామని వెళ్తే అనుమతించడం లేదు. దీంతో ప్రభుత్వ తీరుపై మీడియా వర్గాల్లో ఒక రకమైన చర్చ నడుస్తోంది. తెలంగాణలో లేని సంస్కృతి ఏపీలో కనిపిస్తోందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి రోజురోజుకు పెరుగుతోంది. సంక్షేమ పథకాల అమలు లేదు. అభివృద్ధి జరగడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మీడియా లో వ్యతిరేక కథనాలు వస్తుండడంతో కూటమి ప్రభుత్వం తట్టుకోలేకపోతోంది. అయితే అనుకూల మీడియా ఉంది కదా. అనుకూల ప్రచారాలు జరుగుతున్నాయి కదా. మరి అటువంటి అప్పుడు ఈ నాలుగు ఛానళ్ల కు భయపడడం ఏంటి? అనేది ఆసక్తికరంగా మారుతోంది. కూటమి పార్టీలకు భయం పట్టుకుందని.. అందుకే మీడియాను నియంత్రించేందుకే ఇలా దొడ్డిదారికి దిగిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.