Tuesday, April 22, 2025

తీవ్ర నిర్ణయం దిశగా పిఠాపురం వర్మ?

- Advertisement -

పిఠాపురం వర్మ తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. జనసేన ప్లీనరీ వేదికగా మెగా బ్రదర్ నాగబాబు చేసిన ప్రకటన ఇప్పుడు వర్మలో కాక రేపుతోంది. రాష్ట్రస్థాయిలో కూటమి కొనసాగాలి. కూటమి కొనసాగాలంటే పవన్ వండాలి. పవన్ ఉండాలంటే పిఠాపురం అతనికి వదిలేయాలి. అదే జరిగితే తనకు రాజకీయ భవిష్యత్తు లేదని వర్మ భావిస్తున్నారు. అందుకే తన రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

జనసేన ప్లీనరీ వేదికగా నాగబాబు ఆవేశపూరితంగా ప్రసంగించారు. పిఠాపురంలో పవన్ గెలుపునకు రెండే కారణాలు ఉన్నాయన్నారు. ఒకటి పవన్, రెండు పిఠాపురం ప్రజలే తప్ప ఇందులో ఎవరి పాత్ర లేదని తేల్చేశారు. ఫలితంగా తెలుగుదేశం పార్టీతో పాటు వర్మను సైడ్ చేశారు. పిఠాపురం నుంచి తెలుగుదేశం పార్టీని డిఫెన్స్ లో పడేశారు.

అయితే ఇప్పటికిప్పుడు పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన ను చంద్రబాబు వదులుకోరు. పవన్ కళ్యాణ్ ను కాదని వర్మకు పదవి ఇవ్వలేరు. అందుకే ఆ పార్టీలో ఉండడం సేఫ్ కాదని వర్మ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పిఠాపురం వేదికగా జరిగిన ఈ సభలో ఫుల్ క్లారిటీ చేశారని.. ఇక తెలుసుకోవాల్సింది వర్మ మాత్రమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పిఠాపురం నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ ఫిక్స్ చేసుకున్నారని.. అందుకే ఎంత దాకా అయినా తెగించేందుకు సిద్ధపడుతున్నారని వర్మ అనుచరులు అనుమానిస్తున్నారు. ఎన్నికల వరకు వర్మను చేరదీసి.. తరువాత దూరం పెట్టడాన్ని అర్థం చేసుకుంటున్నారు. పవన్ తాను అనలేక నాగబాబు చే అనిపించారని అనుమానిస్తున్నారు.

ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సైతం సరైన నాయకత్వం కనిపించడం లేదు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు జనసేన లో చేరేందుకు సిద్ధపడ్డారు. వంగా గీత వ్యవహార శైలి కూడా అలానే ఉంది. అందుకే వర్మను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం.

పిఠాపురం నియోజకవర్గంలో వర్మకు ప్రత్యేక స్థానం ఉంది. 2014లో ఇదే తెలుగుదేశం పార్టీ వర్మకు టికెట్ ఇవ్వలేదు. ఏకంగా ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయం సాధించారు వర్మ. అందుకే వర్మను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చి టికెట్ ఇవ్వాలని చూస్తున్నారు. అటు వర్మ అవసరం కూడా ఉంది. ఇటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అవసరం కూడా కనిపిస్తోంది. అయితే అంత వేగంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ఒకవేళ టిడిపి హై కమాండ్ నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ లేకపోతే మాత్రం వర్మ గోడ దూకడం ఖాయం.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!