Tuesday, April 22, 2025

కూటమి గెలుపు నా కృషి.. తేల్చి చెప్పిన పవన్.. టిడిపిలో ప్రకంపనలు!

- Advertisement -

ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకనుంచి మరో లెక్క.. ఈ మాట అన్నది ఎవరో తెలుసా? ఎవర్ని ఉద్దేశించో తెలుసా? అవును తెలుగుదేశం పార్టీ గురించి పవన్ కళ్యాణ్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీని నేనే నిలబెట్టాను అంటూ తన మనసులో ఉన్న మాటను బయటపెట్టే సారు. జనసేన ప్లేనరీలో ప్రసంగం చేసే సమయంలో తెలుగుదేశం పార్టీని నిలబెట్టింది నేనే అంటూ నర్మగర్భంగా మాట్లాడారు. తన వల్లే టిడిపి అధికారంలోకి వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. దీనిపై టిడిపి శ్రేణులు మండిపడుతున్నాయి.

మొన్నటి ఎన్నికల్లో 40 ఏళ్ల చరిత్ర కలిగిన టిడిపిని నిలబెట్టానని పవన్ వ్యాఖ్యానించారు. దీంతో ఒక్కసారిగా టిడిపి శ్రేణులు మండిపడుతున్నారు. పవన్ మనసులో ఇంత అక్కసు ఉందా అని ప్రశ్నిస్తున్నారు. మనసులో ఇంత పెట్టుకుని 15 ఏళ్ల పాటు కొనసాగుతామని ఎలా చెబుతున్నారని నిలదీసినంత పని చేస్తున్నారు. తమతో పుత్తు పెట్టుకోకపోతే కనీసం అసెంబ్లీలో కూడా అడుగుపెట్టలేదని తెలుసుకో అంటూ టిడిపి యాక్టివిస్టులు సోషల్ మీడియా వేదికగా ఇతను పలుకుతున్నారు.

పిఠాపురంలో జనసేన ప్లీనరీ వేదికగా పవన్ చేసిన ప్రసంగం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఆగ్రహానికి కారణం అవుతోంది. కూటమికి అధికారం తమ బిక్ష అన్నట్టు పవన్, ఆయన పార్టీ నాయకులు మాట్లాడటం పై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. నోరు ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అందరం కలిసి ఐక్యంగా విజయం సాధించామని చెబితే హుందాగా ఉండేదని.. కానీ జనసేన నాయకులు తమ నాయకుడు పవన్ లేకపోతే కూటమికి అధికారం దక్కేది కాదని మాట్లాడడం అహంకారానికి నిదర్శనంగా చెబుతున్నారు.

ఒకవైపు చంద్రబాబు నాయకత్వాన్ని పొగుడుతూనే.. తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసి కుట్ర జరుగుతోందన్న అనుమానం టిడిపి శ్రేణుల్లో ఉంది. పైగా మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడిన తీరు సరిగ్గా లేదని.. పిఠాపురంలో పవన్ గెలుపు వెనుక ఎవరూ లేరని చెప్పడం ఏంటని గట్టిగానే మండిపడుతున్నారు తెలుగు తమ్ముళ్లు. దీనిని ఆదిలోనే తుంచేయకపోతే మెగా బ్రదర్స్ ఇద్దరు టిడిపిని పనిగట్టుకుని పతనం చేస్తారని హెచ్చరిస్తున్నారు.

పార్టీ అధినేత హోదాలో పవన్ చేసిన ప్రసంగాన్ని ఎక్కువమంది తప్పు పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నడూ జనసేన ను ఉద్దేశించి తప్పుగా మాట్లాడలేదని.. కానీ ఒక పార్టీ అధినేత పవన్ అలా మాట్లాడడం ఏంటని.. ఇది కూటమి ధర్మానికి విఘాతం కలిగించడమేనని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో మెగా బ్రదర్ నాగబాబును కట్టడి చేయాలని కోరుతున్నారు. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ కూటమి గెలుపులో సింహభాగం కృషి తనదేనని చెప్పడం ద్వారా.. భవిష్యత్తు సంకేతాలు ఇవ్వగలిగారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!