Tuesday, April 22, 2025

పవన్ కళ్యాణ్ ను నీడలా వెంటాడుతున్న ప్రకాష్ రాజ్

- Advertisement -

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను నీడలా వెంటాడుతున్నారు నటుడు ప్రకాష్ రాజ్. పవన్ కళ్యాణ్ రాజకీయ వైఫల్యాలపై ఎక్కువగా ప్రశ్నిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులు చేయలేనంత, నిలదీయలేనంత స్థాయిలో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ నుంచి సమాధానమే లేకుండా పోతోంది. ప్రారంభంలో ఒకటి రెండుసార్లు కౌంటర్ ఇచ్చిన పవన్.. ప్రకాష్ రాజ్ ధాటికి తట్టుకోలేక సైలెంట్ అయ్యారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు నటుడు ప్రకాష్ రాజ్. చాలా అంశాలపై మాట్లాడుతూ పవన్ వైఖరిని తప్పు పట్టారు. అధికారంలో ఉన్నారు టైం వేస్ట్ చేయకండి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ వ్యాఖ్యానించారు ప్రకాష్ రాజ్. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సమస్యలపై మాట్లాడేవారని.. కానీ అధికారంలోకి వచ్చాక సమస్యలను పట్టించుకోవడం మానేసారని చెప్పుకొచ్చారు. తిరుమల లడ్డు వ్యవహారంలో సైతం అలానే చేశారని.. తాను సనాతన ధర్మానికి వ్యతిరేకిని కానని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నందున లడ్డు వివాదం పై ఆధారాలు ఉంటే మాత్రమే మాట్లాడాలని సూచించానని గత విషయాలను గుర్తు చేశారు. ఆధారాలు ఉంటే వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవచ్చు కదా అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ కామెంట్స్ చేయడం ఇదే తొలిసారి కాదు. టీటీడీ లడ్డు వివాదంలో మాట్లాడారు.. సనాతన ధర్మ పరిరక్షణ విషయంలోనే కామెంట్స్ చేశారు. మొన్నటికి మొన్న త్రిభాషా విధానంపై పవన్ వ్యాఖ్యలను తప్పుపడుతూ కామెంట్స్ చేశారు. ఇలా అన్ని వ్యవహారాల్లోనూ పవన్ పై తనకున్న అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేస్తున్నారు ప్రకాష్ రాజ్.

పవన్ కళ్యాణ్ వెనుక బిజెపి ఉందన్నది ప్రకాష్ రాజ్ అనుమానం. గత కొన్నేళ్లుగా బిజెపి విధానాలను వ్యతిరేకిస్తూ వచ్చారు ప్రకాష్ రాజ్. ఏ విషయంలోనూ బిజెపిని భయపడలేదు. ఎన్డీఏ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ద్వారా విస్తరించాలన్న ప్రయత్నంలో బిజెపి ఉంది. అందుకే పవన్ కళ్యాణ్ విషయంలో అతిగా స్పందిస్తున్నారు ప్రకాష్ రాజ్.

సినీ పరిశ్రమకు చెందిన ఈ ఇద్దరు మంచి మిత్రులే. 2024 ఎన్నికల్లో బిజెపితో జనసేన జతకట్టడం.. అధికారంలోకి రావడం.. దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించాలన్న ప్రయత్నం బిజెపి చేయడం.. దానికి పవన్ కళ్యాణ్ సహకరిస్తుండడాన్ని మాత్రమే ప్రకాష్ రాజ్ తప్పుపడుతున్నారు. ఏపీలో ప్రధాన పాలకపక్షంగా టిడిపి ఉంది. సీఎంగా చంద్రబాబు ఉన్నారు. కానీ వారిని టార్గెట్ చేయకుండా.. పవన్ కళ్యాణ్ మాత్రమే ప్రకాష్ రాజ్ లక్ష్యంగా చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తద్వారా ప్రకాష్ రాజ్ లక్ష్యం అనేది ఏంటో స్పష్టం అవుతోంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!