Tuesday, April 22, 2025

ఇదేం నామినేటెడ్ పదవులు.. వదులుకునేందుకు నేతలు సిద్ధం

- Advertisement -

ఏపీలో కూటమినేతలకు నామినేటెడ్ పదవులు దక్కాయి. రెండుసార్లు విడుదల చేసిన జాబితాలో వందలాదిమంది పదవులు దక్కించుకున్నారు. కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, ఇతరత్రా పదవులు సైతం పొందిన వారు ఉన్నారు. అయితే వీరికి పదవులే తప్ప.. పవర్స్ లేవు. నిధులు సైతం లేవు. దీంతో వారిలో ఒక రకమైన అసంతృప్తి కనిపిస్తోంది.

వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నామినేటెడ్ పదవులను పెంచింది జగన్మోహన్ రెడ్డి. అప్పట్లో చాలామందికి పదవులు ఇచ్చారు. ప్రోత్సాహం కూడా అందించారు. పార్టీకి పనికొచ్చారని కొందరిని.. పనికొస్తారని మరికొందరికి పిలిచి మరీ పదవులు ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే గౌరవ వేతనాలు కూడా అందించారు. అయితే ఇప్పుడు కూటమి నియామకాలు చేపట్టి నెలలు గడుస్తున్న ఎటువంటి గౌరవ వేతనం లేదని నేతలు వాపోతున్నారు.

నామినేటెడ్ పదవుల్లో సింహభాగం తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది. జనసేనకు సైతం ప్రాధాన్యం ఇచ్చారు. బిజెపి నేతలు కొద్దిపాటి పదవులతో సర్దుబాటు చేసుకున్నారు. అయితే పదవులు దక్కించుకున్న చాలామంది నేతలు అసంతృప్తితో ఉన్నారు. వారికి కార్యాలయం అంటూ లేదు. నిధులు లేవు. ఎటువంటి పవర్స్ లేవు.

గతంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నామినేటెడ్ పదవి సైతం ఒక ప్రోటోకాల్ ని ఏర్పాటు చేశారు. సొంత ప్రాంతంలో గౌరవం దక్కేల చూశారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవి అయిన సొంత ప్రాంతంలో గుర్తింపు లేదు. కనీసం ఆయనకు నామినేటెడ్ పదవి దక్కిందన్న గౌరవం కూడా లభించడం లేదు. దీంతో పదవులు పొందిన వారు కాస్త బాధతోనే ఉన్నారు.

నామినేటెడ్ పదవితో తమకు తిరుగు లేదని భావించిన నేతలు చాలామంది ఉన్నారు. అటువంటివారు గత రెండు నెలలుగా పరిస్థితిని చూసి ఇంతేనా అని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నామినేటెడ్ పదవితో ధర్పం వెలగబెడతామని భావించామని.. కనీస నిధులు లేని ఈ పదవులు ఎందుకని ప్రశ్నించిన వారు ఉన్నారు. కనీసం తమ కార్యాలయం ఏంటో తెలియడం లేదని.. ఏ శాఖ పరిధిలో పనిచేస్తున్నామో కూడా తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న వారు ఉన్నారు.

నామినేటెడ్ పదవి అంటే ఒక వెహికల్, అలవెన్స్లు, గౌరవ వేతనాలు అందుతాయని ఎక్కువమంది భావించారు. డైరెక్టర్లకు సైతం వేతనాలు ఇస్తారని ఊహించారు. కానీ నియామకం అయి నెలలు గడుస్తున్న ఒక్కసారి కూడా గౌరవ వేతనం రాలేదు. అలవెన్స్లు మంజూరు చేయలేదు. అసలు తమ పని ఏంటని కూడా చెప్పేవారు లేరు. దీంతో నామినేటెడ్ పదవులు దక్కించుకున్న వారు తెగ బాధ పడిపోతున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు. పార్టీ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. అయితే ఈ పదవుల విషయంలో ఇదే పరిస్థితి కొనసాగితే చాలామంది స్వచ్ఛందంగా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!