125 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ…క్రమంగా తన ప్రభాల్యాన్ని కోల్పోయింది. దేశంలో తన ఉనికిని కాపాడుకోవడం కోసం తెగ తాపత్రయపడుతుంది. గతంలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పరువు కోసం పాకులాడటం విశేషంగా మారింది.2004 నుంచి 2014 వరకు కూడా కాంగ్రెస్ హయంనే నడించింది. ఇప్పటికే దశబ్దకాలంగా అధికారానికి దూరంగా ఉన్న ఆ పార్టీ… భవిష్యత్తు కోసం పాకులాడుతుంది. దివంగత నేత వైఎస్ఆర్ చలవ వల్లే రెండుసార్లు కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది.
దీనిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీ మాజీ ఉప అధ్యక్షుడు రాహుల్ గాంధీ జోడో యాత్ర పేరిట దేశం మొత్తాన్ని చూట్టేస్తున్నారు. దీనిలో భాగంగానే ఆయన ప్రస్తుతం ఏపీలో తన పాదయాత్రను కొసాగిస్తున్నారు. దీనిలో భాగంగానే ఆయన పార్టీ భవిష్యత్తు గురించి స్పందించారు. ప్రధాన మంత్రి ప్రెస్ మీట్ పెట్టి వారికి సమాధానం చెప్పేలేరని.. తాము ఎవరితోనైనా.. చర్చించడానికి సిద్దమని తెలిపారు. ఇదే సమయంలో ఏపీ రాజధాని గురించి కూడా స్పందించారాయన. తాము మూడు రాజధానులకు వ్యతిరేకం అని.. అమరావతినే రాజధానికగా కొనసాగించాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోకి అధికారంలోకి వస్తే..తమ మొదటి సంతకం ఏపీకి ప్రత్యేక హోదాపైనే అని రాహుల్ గాంధీ తెలిపారు. ఈ సమయంలో మీడియా ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.
2018లో తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు కదా.. 2024 ఎన్నికల్లో టీడీపీతో పెట్టుకునే అవకాశాలు ఉన్నాయా అని ప్రశ్నించగా..అలాంటిది ఏమి లేదని రాహుల్ గాంధీ తెలిపారు. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా అని ప్రశ్నించగా.. దానికి కొత్తగా ఎన్నికైనా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే నిర్ఱయం తీసుకుంటారని చెప్పుకొచ్చారు. అయితే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపేది లేదని వైసీపీ నాయకులు చెబుతున్నారు. దీనిపై ఇప్పటికే పార్టీ నాయకులు క్లారిటీ ఇచ్చారు. ఇక రాహుల్ గాంధీ పాదయాత్ర విషయానికి వస్తే.. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ 3500 కిలోమీటర్ల మేర సాగుతుంది. ఇప్పటికే ఆయన 1000 కిలోమీటర్లను పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో ఏపీలో నాలుగు రోజుల పాటు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగనుంది.