Tuesday, April 22, 2025

చంద్రబాబుకు షాక్.. టిడిపి ఎమ్మెల్యేల పై పీఎంవో సంచలన నివేదిక!

- Advertisement -

చంద్రబాబుకు షాక్ తగిలిందా? కేంద్రం నుంచి దిమ్మతిరిగే ఆదేశాలు వచ్చాయా? టిడిపి ఎమ్మెల్యేల అవినీతి జాతీయ స్థాయి వరకు వెళ్లిందా? కేంద్రం సైతం సీరియస్ గా ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల అవినీతి చిట్టా ప్రధానమంత్రి కార్యాలయానికి చేరినట్లు తెలుస్తోంది. అదే విషయంపై చంద్రబాబుకు వర్తమానం అందినట్లు సమాచారం. ఆ ఎమ్మెల్యేలపై నిఘా పెట్టాలని.. లేకుంటే నేరుగా రంగంలోకి దిగుతామని కేంద్రం హెచ్చరించినట్లు సమాచారం.

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు పలుమార్లు పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ఎన్డీఏ పక్ష సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఎమ్మెల్యేలు అవినీతికి దూరంగా ఉండాలని సూచించారు. లేనిపోని ఇబ్బందులు తెచ్చి పెట్టవద్దని కూడా పార్టీ ఎమ్మెల్యేలకు హితబోధ చేశారు.

కానీ టిడిపి ఎమ్మెల్యేలు చాలామంది అవినీతిలో కూరుకుపోయినట్లు ప్రచారం జరుగుతోంది. మద్యం, ఇసుక, మట్టి మాఫియాలో టిడిపి ఎమ్మెల్యేల పాత్ర పెరుగుపోతోందన్న విమర్శలు వస్తున్నాయి. అధికారాన్ని, అధికారులను అడ్డం పెట్టుకుని అడ్డగోలు దోపిడీకి దిగుతున్నారన్నది ఎమ్మెల్యేలపై వస్తున్న ఆరోపణ. ఇదే విషయం కేంద్రానికి ఫిర్యాదుల రూపంలో వెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు కేంద్ర నిఘా సంస్థలు సైతం గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇటీవల ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సీఎం చంద్రబాబుకు ఒక సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన టిడిపి ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నట్లు పీ ఎం ఓ ఒక నివేదిక తయారు చేసి పంపినట్లు సమాచారం. దానిని చూసి చంద్రబాబు సైతం షాక్ కు గురైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ స్థాయిలో అవినీతి జరుగుతోందా అని ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు సమాచారం.

వాస్తవానికి చంద్రబాబు ఎప్పటికప్పుడు పార్టీ ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇస్తూ వచ్చారు. అప్రమత్తం చేస్తూ వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో అవినీతికి దూరంగా ఉండాలని.. మద్యంతో పాటు ఇసుక విషయంలో అస్సలు కలుగ చేసుకోవద్దని ఆదేశించారు. కానీ కొందరు ఎమ్మెల్యేలు మాత్రం ఆ రెండు వ్యాపారాల్లో ఆరితేరిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఎమ్మెల్యేలు పట్టు తప్పుతున్నట్లు సమాచారం. రాయలసీమలో జరిగిన పరిణామాలతో కొంతమంది బిజెపి ఎమ్మెల్యేలే ప్రధానమంత్రి కార్యాలయానికి సమాచారం అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

మొన్న ఆ మధ్య టిడిపి నేత జెసి ప్రభాకర్ రెడ్డి, బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య వివాదం నడిచిన సంగతి తెలిసిందే. ఇంకోవైపు బిజెపి ఎంపీ సీఎం రమేష్ వర్సెస్ బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నట్టు పరిస్థితి మారింది. ఇద్దరి మధ్య వివాదం జరిగింది. దీంతో బిజెపి నేతలే కేంద్రానికి సమాచారం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు నిఘా సమస్యలు సైతం ఏపీలో అవినీతి పెరుగుతోందని నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది.

అయితే ఈ మొత్తం వ్యవహారంతో చంద్రబాబు ఒక్కసారిగా ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది. అవినీతికి దూరంగా ఉండాలని సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సూచిస్తే ఈ స్థాయికి.. దిగజారుతారా అని ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. పీ ఎం ఓ నుంచి వచ్చిన నివేదికలో.. ఎవరెవరి పేర్లు ఉన్నాయో వారిని పిలిచి మాట్లాడేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!