Sunday, March 16, 2025

26న వైసీపీలోకి ఉండవల్లి.. జగన్ గ్రీన్ సిగ్నల్!

- Advertisement -

ఏపీ రాజకీయ వర్గాల్లో ఒక వార్త హల్చల్ చేస్తోంది. బిగ్ బ్రేకింగ్ న్యూస్ గా నిలుస్తోంది. అతి త్వరలో రాజమండ్రి మాజీ ఎంపీ, సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీలో చేరుతారని తెలుస్తోంది. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారని.. ఈనెల 26న ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమని తెగ ప్రచారం నడుస్తోంది. గత కొద్ది రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు ఉండవల్లి. అయితే తరచూ రాజకీయ విశ్లేషణలు చేస్తూ సమకాలీన అంశాలపై మాట్లాడుతూ వస్తున్నారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన వైసీపీలోకి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రాజశేఖర్ రెడ్డి కి అత్యంత విధేయత కలిగిన నేత కావడంతో.. ఆయన తప్పకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని తెలుస్తోంది.

ఈ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగిన ఆ పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే దక్కాయి. దీంతో వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నేతలు బయటకు వెళ్తున్నారు. వైసీపీ హయాంలో పదవులు అనుభవించిన వారు సైతం ఇక పార్టీకి భవిష్యత్తు లేదని చెబుతూ గుడ్ బై చెబుతున్నారు. పార్టీలో నెంబర్ 2 గా ఉన్న విజయసాయిరెడ్డి సైతం రాజీనామా బాట పట్టారు. రాజకీయాలనుంచి వైదొలి గారు. అయితే జగన్ చుట్టూ కోటరీగా ఉన్న నేతలు వల్లే గతంలో విజయసాయి రెడ్డి లాంటి నేతలు బయట ఉండిపోయారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఉన్న.. జగన్మోహన్ రెడ్డి వద్ద అంత ప్రాధాన్యం దక్కుతుందో లేదో అన్న బెంగ వారిని వెంటాడింది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి నేతల అవసరం ఏర్పడింది. అందుకే ఇప్పుడు వారిని ఆశ్రయిస్తుండటంతో సానుకూలత ఏర్పడుతోంది. వైసీపీలోకి వచ్చేందుకు ఆ సీనియర్ నేతలు సమ్మతిస్తున్నారు.

వాస్తవానికి వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అత్యంత విధేయత కలిగిన నేత ఉండవల్లి అరుణ్ కుమార్. తాను రెండుసార్లుగా ఎంపీగా గెలిచాను అంటే అది రాజశేఖర్ రెడ్డి చలువ అంటూ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు ఉండవల్లి. తెలంగాణలో షర్మిల పార్టీ ఏర్పాటు చేసిన సమయంలో విజయమ్మ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రత్యేకంగా పిలిపించుకున్నారంటే ఆయన ప్రయారిటీ అర్థమవుతోంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు సమయంలో ఉండవల్లి ఆ పార్టీలో చేరతారని అంతా భావించారు. కానీ రాజశేఖర్ రెడ్డి మాదిరిగా జగన్మోహన్ రెడ్డి వద్ద ప్రాధాన్యత ఉంటుందో.. ఉండదు అన్న సంశయంతో ఉండవల్లి ఉండిపోయారు. మరోవైపు జగన్ చుట్టూ ఉన్న నేతల వైఖరి సైతం ఉండవల్లికి నచ్చలేదు. అందుకే అప్పట్లో ఆయన చేరలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారడంతో ఉండవల్లి వైసీపీలోకి వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

2014లో రాష్ట్ర విభజన సహేతుకంగా చేయలేదన్న కారణంతో ఉండవల్లి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అప్పటినుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సమకాలిన రాజకీయ అంశాలపై విశ్లేషణ చేస్తుంటారు. తరచూ రాజకీయ అంశాలపై విలేకరుల సమావేశం పెడుతుంటారు. ఇప్పటికీ రాజకీయాల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ కు ప్రత్యేక స్థానం ఉంది. అటువంటి నేత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరితే మాత్రం పార్టీకి ఎంతో ప్రయోజనం. ఈ విషయాన్ని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి ఉండవల్లి అరుణ్ కుమార్ తో స్వయంగా మాట్లాడినట్లు ప్రచారం నడుస్తోంది. అన్ని సవ్యంగా సాగితే ఈ నెల 26న ఉండవల్లి అరుణ్ కుమార్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయంగా తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!