Tuesday, April 22, 2025

అరకు వైయస్సార్ కాంగ్రెస్ ఎంపీ ని అవమానించిన టిడిపి కూటమి!

- Advertisement -

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను విస్మరిస్తున్నారా? వారి విషయంలో అస్సలు ప్రోటోకాల్ పాటించడం లేదా? అధికారిక కార్యక్రమాలకు వారికి పిలవడం లేదా? కేంద్ర ప్రభుత్వం సైతం అదే చేస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి.

గత కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం అరకు కాఫీని ప్రమోట్ చేసే పనిలో పడింది. అరకు కాఫీ ప్రాధాన్యతను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. ఒకటి రెండు సార్లు దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు కూడా. ఏపీ సీఎం చంద్రబాబు అయితే అరకు కాఫీ ని జాతీయస్థాయిలో ప్రమోట్ చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

అయితే రాష్ట్రం నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు పార్లమెంట్ ప్రాంగణంలో అరకు కాఫీ అవుట్ లెట్ ను ప్రారంభించారు. కార్యక్రమానికి రాష్ట్రం తరఫున మంత్రులు, జిసిసి చైర్మన్ ఇతరత్రా ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. కానీ అక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ డాక్టర్ తనుజారాణి కనిపించలేదు. ఆమె అరకు ఎంపీగా ఉన్నారు. కనీసం ఆమెను పిలిచారా? పిలిచిన ఆమె వెళ్లలేదా? పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది.

మొన్నటి కూటమి ప్రభంజనంలో సైతం తనుజారాణి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు. బిజెపి అభ్యర్థి కొత్తపల్లి గీత పై ఘన విజయం సాధించారు. ఆమె జగన్మోహన్ రెడ్డికి వీర విధేయురాలు. చాలా సాదాసీదాగా ఉంటారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతుంటారు. అందుకే ఆమెను ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమాలకు పిలవడం లేదన్న విమర్శ ఉంది.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి అరకు పార్లమెంట్ నియోజకవర్గం ఆ పార్టీకి పెట్టని కోటగా మారింది. 2014, 2019, 2024లో వరుసగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుస్తూ వస్తున్నారు. 2014లో కొత్తపల్లి గీత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు. కానీ వేరే పార్టీలో ఫిరాయించారు. 2019లో బొడ్డేటి మాధవి గెలిచారు. అయితే ఈసారి ఆమెను అసెంబ్లీకి పంపించి డాక్టర్ తనుజారాణిని తెరపైకి తెచ్చారు జగన్మోహన్ రెడ్డి. తనుజారాణి సూపర్ విక్టరీ సాధించారు. కానీ అధికార పార్టీ ఆమె విషయంలో వివక్ష చూపుతోంది.

వచ్చే ఎన్నికల్లో అరకు పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కూటమి భావిస్తోంది. అందుకే ఒక పద్ధతి ప్రకారం అక్కడ ముందుకెళ్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత పెంచేందుకు నానారకాలుగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే గిరిజన ఉత్పత్తులకు జాతీయస్థాయిలో డిమాండ్ లభించేలా చేయడం, గిరిజన సంక్షేమం పట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టకుండా వ్యవహరిస్తుందని ప్రజలకు సంకేతాలు పంపడం ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది. అందులో భాగంగానే అరకు కాఫీ ప్రమోషన్ కు అరకు ఎంపీ ని పిలవనట్లు తెలుస్తోంది.

అరకు పార్లమెంట్ స్థానం పరిధిలో రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. అరకు తో పాటు పాడేరులో విజయం సాధించింది. మరోవైపు అరకు పార్లమెంట్ సీటును నిలబెట్టుకుంది. అయితే రిజర్వుడ్ నియోజకవర్గాలను టార్గెట్ చేసుకుని ఇప్పుడు కూ టమి రాజకీయాలు మొదలు పెట్టింది. మరి అందులో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!