Sunday, March 16, 2025

అడ్డగోలు ప్రచారంతో అడ్డంగా బుక్ అయిన టిడిపి

- Advertisement -

నవ్విపోదురు గాక అన్నట్టు ఉంది టిడిపి పరిస్థితి. ఈ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించింది టిడిపి. జనసేన తో పాటు బిజెపితో జతకట్టి తాను అనుకున్నది సాధించగలిగింది. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత కూడా పాలన సజావుగా సాగించలేక.. అదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై లేనిపోని ఆరోపణలు చేస్తోంది. ఒకే రకమైన విమర్శలు.. అవినీతి ఆరోపణలు.. వైసిపి పాలన వైఫల్యాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న అతి ప్రచారం విమర్శల పాలవుతోంది. రాష్ట్రంలో వైసిపి హయాంలో మద్యం ద్వారా 30 వేల కోట్ల రూపాయల లూటీ జరిగిందని ఒకవైపు చెబుతోంది. మరోవైపు ఇంకోలా ప్రచారం చేస్తోంది. కనీసం నమ్మశక్యం లేని ఆరోపణలు చేస్తోంది. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో వైరల్ అంశం గా మారింది.

ఇటీవల తెలుగుదేశం పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా ఒక పోస్ట్ పెట్టింది. గత ఐదేళ్ల వైసిపి పాలనలో జే బ్రాండ్ మద్యం అమ్మకాలతో తాడేపల్లికి భారీగా కమిషన్లు వెళ్లాయి అన్నది ఆ పోస్టులో ఉన్న ఆరోపణ. దీనికోసం తాడేపల్లి ప్యాలెస్ లో 280 క్యాష్ కౌంటింగ్ మిషన్లు ఏర్పాటు చేశారని.. 900 మంది షిఫ్టులవారీగా పనిచేశారని సంచలన ఆరోపణలు చేసింది. ప్రతిరోజు 24 గంటలపాటు ఈ కౌంటింగ్ కొనసాగిందని.. ఈ ఐదు సంవత్సరాల పాటు ఈ దోపిడీ కొనసాగిందని ఆ పోస్టులో చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడే అడ్డంగా బుక్ అయింది తెలుగుదేశం పార్టీ.

సాధారణంగా క్యాష్ కౌంటింగ్ మిషన్లను బ్యాంకుల్లో వినియోగిస్తారు. పెద్దపెద్ద లావాదేవీలు జరిగిన సంస్థలు కౌంటింగ్ మిషన్లు తెచ్చుకుంటాయి. వీటి పనితీరు కూడా చాలా వేగంగా ఉంటుంది. అవసరాలకు తగ్గట్టు దాని వేగాన్ని వినియోగించుకోవచ్చు. బ్యాంకుల మాదిరిగానే ఎక్కువమంది క్యాష్ కౌంటింగ్ మిషన్లను వినియోగిస్తారు. ఈ మిషన్లు నిమిషానికి 1800 నోట్లను లెక్కిస్తాయి. గంటకు లక్ష 8 వేల నోట్లను కౌంటింగ్ చేస్తాయి.

టిడిపి ఆరోపించిన విధంగానే పరిగణలోకి తీసుకుంటే.. ప్రస్తుతం చలామణిలో ఉన్న పెద్ద నోట్లు 500 రూపాయలు. ఈ లెక్కన ఈ కౌంటింగ్ మిషన్లు 24 గంటలు పని చేశాయని టిడిపి ఆరోపించిన క్రమంలో.. గంటకు ఐదు కోట్ల 40 లక్షలు ఒక మిషన్ కౌంటింగ్ చేయగలదు. రోజుకు 129 కోట్ల 60 లక్షలు లెక్కించగలదు. 280 మిషన్లను కలిపితే రోజుకు అవి లెక్కించే నగదు అక్షరాల 36,288 కోట్లు. నెల మొత్తం లెక్కిస్తే 10 లక్షల 88 వేల 640 కోట్లు క్యాష్ ఉంటుంది. అదే ఏడాదికి అయితే 130 లక్షల కోట్లు అన్నమాట. మరి ఐదేళ్లకు ఈ గణాంకాలు కూడా చెప్పలేం. మరోవైపు పార్లమెంట్ వేదికగా టిడిపి కూటమి ఎంపీలు వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో 30 వేల కోట్ల రూపాయల మద్యం దోపిడీ జరిగిందని ఆరోపణలు చేశారు. కానీ టిడిపి అధికారిక సోషల్ మీడియాలో మాత్రం అర్థంపర్థం లేని విధంగా పోస్టులు పెట్టడం గమనార్హం.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నాసిరకం మద్యం సరఫరా చేశారని.. ధరలు పెంచారని.. జి టాక్స్ తో భారీగా దోపిడీకి పాల్పడ్డారని లేనిపోని ఆరోపణలు చేసింది తెలుగుదేశం పార్టీ. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత ప్రైవేట్ మద్యం పాలసీని పెట్టింది. అన్ని రకాల బ్రాండెడ్ మద్యం ను అందుబాటులోకి తెచ్చింది. కానీ ధరలు మాత్రం అమాంతం పెంచింది. దానిపై విమర్శలు వస్తుండడంతో తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై లేనిపోని ప్రచారానికి తెరలేపింది. అయితే అర్థంపర్థం లేని పోస్టులతో అభాసు పాలవుతోంది తెలుగుదేశం పార్టీ

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!