Tuesday, April 22, 2025

టిడిపి,జనసేన అంతర్యుద్ధం.. ఐదేళ్లు డౌటే!

- Advertisement -

మరో 15 ఏళ్ల పాటు తమ స్నేహం కొనసాగుతుందని చంద్రబాబుతో పాటు పవన్ తరచూ చెబుతుంటారు. ఇరు పార్టీల శ్రేణులు ఇబ్బందులు ఉన్న సర్దుకోవాలని సూచిస్తుంటారు. అయితే తెర వెనుక మాత్రం ఎవరి రాజకీయం వారిదే. ఒకరిపై ఒకరికి అప నమ్మకం స్పష్టంగా కనిపిస్తోంది. కానీ మధ్యలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఎదురయ్యే ఇబ్బందులు గుర్తు చేసుకుని మరి ఇరు పార్టీల శ్రేణులకు హెచ్చరికలు పంపుతుంటారు పార్టీల అధినేతలు.

అయితే కొద్దిరోజులుగా కూటమి పార్టీల్లో చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. రెండు రోజులపాటు అమరావతిలో కలెక్టర్ల రివ్యూ నిర్వహించారు. ఇంతకీ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. ఆయన గైర్హాజర్ పై స్పష్టమైన ప్రకటన చేయలేదు. గతంలో కలెక్టర్ల సదస్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు పవన్ కళ్యాణ్. ఆయన వద్ద ఉన్న శాఖల ప్రగతిని అప్పట్లో వివరించే ప్రయత్నం చేశారు. లోటుపాట్లను తెలుసుకొని కలెక్టర్లకు కీలక ఆదేశాలు ఇచ్చారు. అటువంటి పవన్ ఇప్పుడు కనిపించకపోయేసరికి రకరకాల అనుమానాలు ప్రారంభం అయ్యాయి.

పవన్ చర్యలు ఎప్పుడూ ఎలా ఉంటాయో తెలియడం లేదు. ఓసారి మంత్రివర్గ సమావేశానికి హాజరు కాలేదు. అనారోగ్యం కారణంగా చూపారు. కానీ అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల ఆలయ సందర్శన చేశారు.

పవన్ కళ్యాణ్ చర్యలపై టిడిపి శ్రేణులు ఆగ్రహంగా ఉన్నాయి. మొన్నటివరకు పవన్ పై అభిమానించిన టిడిపి నేతలే ఆయనపై అనుమానపు చూపులు చూడడం ప్రారంభించారు. రాజకీయ సుస్థిర నిర్ణయాలు తీసుకోరని.. ఎప్పుడు ఏ ప్రకటనలు చేస్తారు తెలియదని ఎక్కువ మంది టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఆయనతో పొత్తు కొనసాగడం కష్టమేనని ఒక అభిప్రాయానికి వస్తున్నారు. మొన్నటికి మొన్న భాగస్వామి పక్షమైన టిడిపికి తెలియకుండానే నాగబాబును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ విషయంలో టిడిపిని కనీసం సంప్రదించలేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అయితే పిఠాపురంలో వర్మ విషయంలో పవన్ కళ్యాణ్ మాట తప్పడం.. అవమానాలకు గురి చేయడం ఏమిటన్న ప్రశ్న వినిపిస్తోంది. ఆయన ఉద్దేశపూర్వకంగానే తెరవెనుక ఉండి అలా చేయిస్తున్నారు అన్నది వర్మ అనుమానం. అదే సమయంలో వర్మ సైతం ప్రజల్లోకి బలంగా వెళ్లి తానేంటో పవన్ కళ్యాణ్ చూపిస్తానని శపథం చేసినట్లు సమాచారం. అయితే వర్మ వెనుక టిడిపి హై కమాండ్ హస్తం ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి. నిన్నటికి నిన్న పిఠాపురంలో వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవానికి వర్మకు ఆహ్వానం లేదు. దీనిని అవమానంగా భావిస్తోంది టిడిపి. ఇలా పరస్పరం రెండు పార్టీల మధ్య ఒక యుద్ధ వాతావరణం ఉంది. దీంతో 15 ఏళ్ల మాట దేవుడు ఎరుగు.. ముందు ఈ ఐదేళ్లలో సవ్యంగా ముందుకు సాగడం ఆ రెండు పార్టీలకు కష్టంగానే ఉంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!