Tuesday, April 22, 2025

పవన్ కళ్యాణ్ ను అగౌరవపరుస్తున్న టిడిపి శ్రేణులు

- Advertisement -

తెలుగుదేశం పార్టీకి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. పార్టీ ఏర్పాటు చేసిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చింది టిడిపి. దశాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించింది. అటువంటి పార్టీని నిలబెట్టాను తాను అని పవన్ కళ్యాణ్ ప్రకటించేసరికి టిడిపి హార్డ్ కోర్ ఫ్యాన్స్ తెగ బాధ పడిపోతున్నారు. చంద్రబాబుతో పవన్ కు ఉన్న సాన్నిహిత్యాన్ని పక్కనపెట్టి.. తెలుగుదేశం పార్టీపై ఆ తరహా కామెంట్స్ చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

సోషల్ మీడియా వేదికగా పెద్ద వార్ జరుగుతోంది. టిడిపి వర్సెస్ జనసేన అన్నట్టు పరిస్థితి మారింది. సోషల్ మీడియాలో అయితే రచ్చ రచ్చ జరుగుతుంది. ముఖ్యంగా నాగబాబును సైడ్ చేయాలని ఎక్కువమంది సూచిస్తున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవే ఎక్కువ.. మంత్రి వద్దంటూ ఎక్కువ మంది సూచిస్తున్నారు.

అయితే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ విషయంలో టిడిపి శ్రేణులకు గౌరవభావం ఉండేది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అరెస్టు జరిగింది. ఆ సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి పవన్ కళ్యాణ్ పరామర్శించారు. బయటకు వచ్చి నేరుగా తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందని ప్రకటించారు. అది మొదలు నిన్నటి జనసేన ప్లీనరీ వరకు పవన్ కళ్యాణ్ పై ఎనలేని గౌరవంతో కొనసాగుతూ వచ్చారు టిడిపి శ్రేణులు.

అయితే నాలుగు దశబ్దాల తెలుగుదేశం పార్టీని నిలబెట్టానని పవన్ ప్రకటించడంతో అప్పటివరకు ఉన్న గౌరవం తగ్గిపోయింది. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం తలోగ్గితే.. టిడిపిని మరింత కిందకు నెట్టి వేస్తారని ఆ పార్టీ శ్రేణులు బాధపడుతున్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ కామెంట్స్ ను తీవ్రంగా ఖండిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ పై నేరుగా ఇప్పుడు టిడిపి శ్రేణులు సోషల్ మీడియాకు ఎక్కుతున్నాయి. రెండు చోట్ల పోటీ చేసిన నువ్వా టిడిపిని నిలబెట్టింది అని ప్రశ్నిస్తున్నాయి. 40 శాతం ఓటు షేరింగ్ తో ఉన్న పార్టీని నువ్వా గెలిపించింది అంటూ నిలదీస్తున్నాయి.

నాలుగు నుంచి ఐదు శాతం ఓటింగ్ను ఏడు శాతానికి పెంచుకున్నావు టిడిపి వల్లనే అంటూ మరికొందరు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. సోదరుడు చిరంజీవిని గెలిపించుకోలేని నువ్వా టిడిపిని గెలిపించింది అంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

అయితే ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ పై ఆ గౌరవంగా టిడిపి శ్రేణులు విరుచుకుపడుతుండడంతో జనసైనికులు సైతం అదే స్థాయిలో స్పందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. దీంతో రెండు పార్టీల మధ్య ఒక రకమైన యుద్ధం నడుస్తోంది. అయితే అధినాయకులు ఇద్దరూ చట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం రెండు పార్టీ శ్రేణుల మధ్య గట్టిగానే వార్ నడుస్తోంది. మరి అది ఎంతవరకు తీసుకెళ్తుందో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!