Saturday, May 3, 2025

పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పై పారని కూటమి పాచిక!

- Advertisement -

వైయస్సార్ కాంగ్రెస్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చుట్టూ కూటమి ఉచ్చు బిగించిందా? విజయసాయిరెడ్డి మాదిరిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లేలా చేయాలని చూసిందా? కానీ ఆయన భయపడలేదా? డోంట్ కేర్ అని చెప్పేసారా? అందుకే మద్యం కేసులో ఇరికించాలని చూస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మద్యం కేసులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్టు చేస్తామని మీడియాకు లీ కులుస్తోంది కూటమి ప్రభుత్వం. అయితే పెద్దిరెడ్డి వెనుక చాలా రకాల పరిణామాలు జరిగినట్లు తెలుస్తోంది.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయసాయిరెడ్డి బయటకు వెళ్తారని ఎవరైనా ఊహించారా? అంతవరకు ఎవరైనా ఆలోచన చేశారా? విజయసాయిరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన క్రమంలో అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఆయనపై కేంద్ర స్థాయిలో విపరీతమైన ఒత్తిడి ఉంది. అందుకే ఒక వ్యూహం ప్రకారం ఆయనను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లేలా చేశారు. పార్టీతో పాటు అధినేతపై విమర్శలు చేయించారు కూడా. ఇప్పుడు అదే ప్రయోగం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పై చేసేందుకు యత్నించారు. కానీ మిధున్ రెడ్డి మాత్రం లెక్క చేయలేదు.

రాజంపేట ఎంపీగా ప్రస్తుతం ఉన్నారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. గత ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆయన ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. కానీ ఇప్పుడు ఆయన మెడకు మద్యం అవినీతిని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అప్పటి ఏపీ బేవరేజెస్ ఎండి వాసుదేవ రెడ్డితో తప్పుడు వాంగ్మూలం ఇప్పించినట్లు ప్రచారం ఉంది. దానిని పట్టుకొని పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని భయపెట్టారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్తావా? కేసులు నమోదు చేయమంటావా అంటూ సంకేతాలు పంపారు. కానీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాత్రం ఈ బెదిరింపులకు లొంగలేదు. అందుకే అరెస్టుల పర్వానికి దిగుతున్నట్లు తెలుస్తోంది.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పెద్దిరెడ్డి కుటుంబం జగన్ వెంట నడిచింది. ఆయన కష్టంలో ఉన్నప్పుడు అండగా నిలబడింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేందుకు ఎంతగానో దోహద పడింది. జగన్మోహన్ రెడ్డి సైతం పెద్దిరెడ్డి కుటుంబానికి ఎనలేని ప్రాధాన్యమిచ్చారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి ఐదేళ్లపాటు మంత్రిగా కొనసాగించారు. ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డికి శాసనసభ్యుడిగా అవకాశమిచ్చారు. వరుసగా మూడుసార్లు రాజంపేట నుంచి పెద్దిరెడ్డి మిధున రెడ్డికి ఛాన్స్ ఇచ్చారు. ఇన్ని అవకాశాలు కల్పించిన జగన్మోహన్ రెడ్డి కష్టాల్లో ఉంటే.. బయటకు వెళ్లడం జరగని పని అంటూ మిధున్ రెడ్డి తేల్చి చెబుతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం కూటమి పెద్దలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని నిర్వీర్యం చేసే పనిలో ఉన్నారు. అందుకు కేంద్ర పెద్దలు కూడా సహకరిస్తున్నారు. అందులో భాగంగానే విజయసాయిరెడ్డిని పార్టీ నుంచి బయటకు పంపారు. ఇప్పుడు అదే పాచిక మిథున్ రెడ్డి విషయంలో కూడా వేస్తున్నారు. కానీ ఈ విషయంలో మిధున్ రెడ్డి వెనక్కి తగ్గే ప్రసక్తి కనిపించడం లేదు. చివరి వరకు జగన్మోహన్ రెడ్డి తోనేనని తేల్చేశారు. అవసరం అయితే కేసులను ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటించారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!