Saturday, May 3, 2025

ప్రకాశంలో బూచేపల్లి కుటుంబం యాక్టివ్!

- Advertisement -

ప్రకాశం జిల్లాలో బూచేపల్లి కుటుంబం పట్టు బిగుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం దిశగా ఆ కుటుంబం అడుగులు వేస్తోంది. ఒకవైపు టిడిపి నేతలు, ఇంకోవైపు జనసేనకు చెందిన మాజీ మంత్రి బాలినేని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసే పనిలో పడ్డారు. దానిని గట్టిగానే తిప్పి కొడుతోంది బూచేపల్లి కుటుంబం. ప్రస్తుతం ఆ కుటుంబం నుంచి బూచేపల్లి వెంకాయమ్మ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఉన్నారు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శి ఎమ్మెల్యేగా ఉన్నారు. వీరిద్దరూ తల్లి కొడుకులు. శివప్రసాద్ రెడ్డికి ప్రకాశం జిల్లా బాధ్యతలు అప్పగించారు జగన్మోహన్ రెడ్డి.

ప్రకాశం జిల్లాలో బూచేపల్లి కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. బూచేపల్లి సుబ్బారెడ్డి ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉండేవారు. పలు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు దగ్గరయ్యారు. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. దర్శి కాంగ్రెస్ టికెట్ ఆశించారు. దక్కకపోయేసరికి ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు సుబ్బారెడ్డి. వైయస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అసోసియేట్ సభ్యుడిగా ఐదేళ్లపాటు ఆయన కొనసాగారు. అయితే 2009 ఎన్నికల్లో ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి నిష్క్రమించారు. ఆయన రెండో కుమారుడు శివప్రసాద్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో బూచేపల్లి కుటుంబం జగన్ వెంట అడుగులు వేసింది. ఆయన స్థాపించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. 2014 ఎన్నికల్లో దర్శి నుంచి వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు శివప్రసాద్ రెడ్డి. కానీ ఓటమి ఎదురైంది. అయినా సరే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తూ వచ్చారు. 2019 ఎన్నికల్లో మాత్రం ఆయనకు పోటీ చేసే అవకాశం దక్కలేదు. అయినా సరే దర్శితోపాటు సంతనూతలపాడు లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు శివప్రసాద్ రెడ్డి. అందుకే 2021 లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో శివప్రసాద్ రెడ్డి తల్లి వెంకాయమ్మ కు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా అవకాశమిచ్చారు జగన్మోహన్ రెడ్డి. 2024 ఎన్నికల్లో దర్శి టిక్కెట్ను శివప్రసాద్ రెడ్డికి కేటాయించారు. కూటమి ప్రభంజనాన్ని తట్టుకొని నిలబడ్డారు శివప్రసాద్ రెడ్డి. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమితో జిల్లా బాధ్యతలను ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి.

ఎన్నికల ఫలితాల అనంతరం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. జనసేనలో చేరిన ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బాలినేని కి అడ్డుకట్ట వేసే పనిలో పడింది బూచేపల్లి కుటుంబం. వెంకాయమ్మ తో పాటు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి సైతం దీటైన కౌంటర్లు ఇస్తున్నారు. జిల్లావ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అండగా నిలబడుతున్నారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన నాయకత్వం దొరికింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!