సుగాలి ప్రీతి కేసు టిడిపి ప్రభుత్వ హయాంలోనే నీరుగారిపోయిందా? అప్పట్లోనే నిజాలను తొక్కి పెట్టారా? అప్పటి ప్రభుత్వం నిందితులకు అండగా నిలిచిందా? కేసు తారుమారు చేశారా? రుజువులను, వాస్తవాలను చెరిపేసారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సుగాలి ప్రీతి కేసును పూర్తిగా నీరుగార్చింది టిడిపి ప్రభుత్వం. దానిని రాజకీయంగా వాడుకున్నారు పవన్ కళ్యాణ్. అప్పట్లో టిడిపి ప్రభుత్వం పై ఒత్తిడి పెంచలేదు. తరువాత వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలు చేశారు. గత ఐదేళ్లుగా వెయ్యి వీడియోలో మాట్లాడి ఉంటారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి 9 నెలలు దాటుతున్న పట్టించుకోలేదు. దీనిపైనే మాట్లాడారు ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్. సుగాలి ప్రీతి కేసు నీరుగార్చింది చంద్రబాబు సర్కార్,. ప్రచార అస్త్రంగా మార్చుకుంది పవన్ కళ్యాణ్. బాధిత కుటుంబానికి న్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
2017 ఆగస్టు 19న అనుమానాస్పదంగా మృతి చెందింది సుగాలి ప్రీతి అనే పదో తరగతి చదువుతున్న విద్యార్థిని. కర్నూలు శివారులోని లక్ష్మీ గార్డెన్ లో నివాసముంటున్న రాజు నాయక్, పార్వతి దేవి దంపతుల కుమార్తె సుగాలి ప్రీతి. నగరంలోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో పదో తరగతి చదువుతుండేది. అయితే సుగాలి ప్రీతి ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కానీ ఇది ఆత్మహత్య కాదని.. స్కూల్ యజమాని కొడుకులు బలవంతంగా రేప్ చేసి చంపేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్మార్టం చేసిన వైద్యులు కూడా.. ఆమెపై అఘాయిత్యం జరిగినట్లు నిర్ధారించారు. ఈ ఆధారాలతో బాధితురాలి తల్లిదండ్రులు తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అప్పట్లో ఈ ఆధారాలను ప్రామాణికంగా తీసుకుని పోలీసులు నిందితులపై ఫోక్సో సెక్షన్ 302, 201, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతో కర్నూలు జిల్లా కలెక్టర్ కూడా స్పందించారు. ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని విచారణకు నియమించారు. అయితే ఈ కమిటీ సైతం లైంగిక దాడి చేసి.. హత్య చేసినట్లు నిర్ధారించింది. ఈ తరుణంలో నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. కానీ 23 రోజులకే వారికి బెయిల్ వచ్చింది. అప్పటినుంచి మృతురాలి తల్లిదండ్రులు పోరాట బాట పట్టారు.
అయితే నిందితులు తెలుగుదేశం పార్టీకి బలమైన మద్దతు దారులు. నేరుగా అప్పటి సీఎం చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగే వారు. అందుకే అప్పట్లో కేసులో బలమైన అంశాలను పక్కదారి పట్టించారు. సాక్షాలను తారుమారు చేశారు. అది రేప్ అని తెలిసిన.. ఆ తీవ్రత లేకుండా చేసి కేసును నీరుగార్చేశారు.
సుగాలి ప్రీతి తల్లి పార్వతి దేవి దివ్యాంగురాలు. ఆమె జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ను కలిశారు. తమ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని వివరించారు. తప్పకుండా టిడిపి సర్కార్ పై ఒత్తిడి పెంచి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. కానీ 2017 నుంచి 2019 మధ్య ఈ కేసు పూర్తిగా నీరుగారిపోయింది. పక్కా ఆధారాలను తారుమారు చేశారు. కానీ పవన్ కళ్యాణ్ నోరు తెరవలేదు.
అయితే ఇంతలో ప్రభుత్వం మారింది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బాధితురాలి తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది. కాదు విచారణ మాత్రం ప్రారంభం కాలేదు.
గత ఐదేళ్లుగా సుగాలి ప్రీతి కేసును ప్రస్తావిస్తూ వచ్చారు పవన్ కళ్యాణ్. ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఈ కేసును రీఓపెన్ చేసి విచారణ పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతోంది. ఎంతవరకు కేసు విచారణ మాత్రం ప్రారంభం కాలేదు. అదే సమయంలో సిబిఐ వెనక్కి తగ్గింది. తమకున్న పని ఒత్తిడితో ఈ కేసు విచారణ చేపట్టలేమని.. ఈ కేసులో అంతటి సంక్లిష్టత లేదని కూడా తేల్చి చెప్పింది. ఇటువంటి పరిస్థితుల్లో బాధితురాలు తల్లి మీడియా ముందుకు వచ్చారు. పవన్ కళ్యాణ్ తో పాటు చంద్రబాబు తీరును తప్పు పట్టారు. తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని.. ఇప్పుడు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వం కూడా తమకు న్యాయం చేయలేదన్నారు. ఇప్పుడు ప్రముఖ విశ్లేషకుడు గా ఉన్న న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ సైతం పవన్ కళ్యాణ్ తీరును తప్పుపడుతున్నారు. సుగాలి ప్రీతి కేసుతో పవన్ కళ్యాణ్ రాజకీయంగా బలపడ్డారని సంచలన ఆరోపణలు చేశారు