కేసీఆర్ ఒక్కడి వల్ల కాదు జగన్ కూడా జాతీయ రాజకీయాల్లోకి రావాలి – మమతా బెనర్జీ
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడంతో .. పలు రాజకీయ పార్టీలు అన్ని కూడా తెలుగు రాష్ట్రాలపై వైపు చూస్తున్నాయి. కేసీఆర్ తన టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా మార్చేశారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మారుస్తూ తీర్మానం చేశారు కేసీఆర్. రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో పోటీ చేయడానికి రెడీ అవుతున్నట్లుగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కేసీఆర్ పోటీ చేయడానికి రెడీ అవుతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే ఆ దిశగా కేసీఆర్ ఆలోచనలు ఉన్నట్లుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే తాజాగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ స్పందించారు.
జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ విజయవంతం కావాలని ఆమె ఆకాక్షించారు. అయితే కేసీఆర్ ఒక్కరే జాతీయ రాజకీయాల్లోకి వస్తే బీజేపీని నిలువరించలేరని.. ఏపీ సీఎం , వైసీపీ అధినేత జగన్ కూడా జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఆమె కోరారు. తెలంగాణలో కేవలం 16 పార్లమెంట్ స్థానాలే ఉన్నాయని.. ఏపీలో మాత్రం 25 స్థానాలు ఉన్నాయని వాటిని ..దీనిని బట్టి చూస్తే.. జగనే ముందుగా జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన అవశ్యకత ఉందని ఆమె తెలిపారు. జగన్ కూడా జాతీయ రాజకీయాల్లోకి వస్తే..అప్పుడు బలమైనశక్తిగా ఎదగవచ్చని ఆమె అభివర్ణించారు.
బీజేపీని ఓడించాలంటే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని ముందుకు వెళ్లాలని పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ సూచించారు. ఇక గతంలోనే ఆమె జగన్ రాజకీయాల్లోకి రావాలంటూ కొందరు నాయకులకు లేఖలు రాయడం జరిగింది. జాతీయ స్థాయిలో బలంగా ఉన్న బీజేపీని ఎదుర్కోవాలి అంటే రాష్ట్ర పార్టీల నేతలు జాతీయ రాజకీయాల్లోకి రావాలంటూ ఆమె గతంలోనే సూచించారు. ఏపీ జగన్‌తో పాటు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కీలకంగా మారితేనే ఇది సాధ్యం అవుతుందని ఆమె ఆకాంక్షించారు. అయితే మమతా బెనర్జీ లేఖపై జగన్ స్పందించింది లేదు. పైగా సీఎం అయిన దగ్గర నుంచి కూడా బీజేపీతో మంచి మైత్రిబంధాన్ని కొనసాగిస్తున్నారు జగన్. మరి కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడంతో.. పక్క రాష్ట్రం సీఎం అయిన జగన్‌పై ఒత్తిడి పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. మరి దీనిపై వైసీపీ అధినేత జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.