Sunday, March 16, 2025

పాపం మంగ్లీ.. వైసీపీకి మద్దతుగా పాట పాడడమే తప్పా?

- Advertisement -

నవ్విపోదురు గాక నాకేంటి.. అన్నట్టు ఉంది టిడిపి కూటమి పరిస్థితి. ప్రతిదీ రాజకీయ కోణంలో చూడడమే. ప్రతి అంశం రాజకీయాలతో ముడిపెట్టడమే. వారు మనకు ఓటు వేయలేదు. మనకు అనుకూలంగా పనిచేయలేదు. అందుకే వారు ఉండకూడదు. వారి రంగంలో రాణించకూడదు. ఇప్పుడు ఏపీలో ఇదే ట్రెండ్ నడుస్తోంది. పొరపాటున తమ పార్టీని విభేదించే వారిని, తమ సిద్ధాంతాలను వ్యతిరేకించే వారిని క్షమించకూడదు. పౌర సమాజంలో ఉండకూడదు. ఇప్పుడు ఏపీ సమాజంలో అదే నడుస్తోంది. అదే అమలవుతోంది. ముఖ్యంగా వైసీపీకి సపోర్ట్ చేసిన ఏ వర్గం కూడా నిలబడకూడదు. కనీసం ఉనికి చాటుకోకూడదు. ఒకవేళ ఎవరైనా సపోర్ట్ చేస్తే.. ఎంతటి వారైనా వ్యతిరేకించాల్సిందే. ఏపీలో నడుస్తున్న నయా ట్రెండ్ అదే.

ఏదైనా రాజకీయ పార్టీని నడపాలంటే అనేక రకాల అంశాలు దోహదపడాలి. అప్పుడే రాజకీయాల్లో రాణించగలుగుతారు. 1983లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చిన ఎన్టీఆర్ వెనుక అనేక శక్తులు పనిచేశాయి. అనేకరకాల అంశాలు దోహదం చేశాయి. అది ఏ రాజకీయ పార్టీ కైనా వర్తిస్తుంది. 2011లో తండ్రి అకాల మరణంతో సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. తన సొంత రెక్కల కష్టంతో కష్టాలను అధిగమించారు. ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తొలుత ప్రతిపక్ష హోదాకు పరిమితం అయ్యారు. తరువాత అధికారపక్షంలోకి వచ్చారు. ఇందులో కర్త, కర్మ,క్రియ జగన్మోహన్ రెడ్డి. ఇతర అంశాలు దోహదపడ్డాయి కానీ.. జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తెచ్చేందుకు అవే ప్రధాన కారణాలు కావు. అయితే సమాజంలో ఉన్నది ఒక్క రాజకీయరంగమే కాదు. సమాజాన్ని ప్రభావితం చేసి చాలా రంగాలు ఉంటాయి. కానీ వాటిని రాజకీయాల కోసం వాడుకోవడం ముమ్మాటికి తప్పిదం. ఇప్పుడు తెలుగుదేశం కూటమి చేస్తున్న తప్పిదం అదే.

నైపుణ్యం తో పాటు టాలెంట్ అన్నది ఏ ఒక్కరి సొంతం కాదు. దానిని రాజకీయాలతో ముడి పెట్టడం అంతకంటే భావ్యం కాదు. కానీ టిడిపి కూటమి తాజాగా అటువంటి తప్పిదానికే పాల్పడింది. తెలుగు సంగీత రంగంలో ఉవ్వెత్తున ఎగసిపడింది మంగ్లీ అనే సింగర్. ఎన్నెన్నో మంచి పాటలు పాడి తనకంటూ ఒక ఇమేజ్ సృష్టించుకుంది ఆమె. ఈ క్రమంలోనే ఆమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం పాటలు పాడారు. ఆమె పాడిన పాటలు ఉత్తేజపరిచాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణమయ్యాయి. అంతమాత్రానికి ఆమె పాటలే వైసిపి విజయానికి కారణం అని చెప్పలేం. కానీ ఆమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం పాడిన పాటలు ఇప్పుడు ఆమె పట్ల వివక్సానికి కారణమవుతున్నాయి.

శ్రీకాకుళం జిల్లాలో రథసప్తమి పర్వదినానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ జిల్లాలో సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉంది. ఇది దేశంలోనే ఏకైక సూర్య దేవాలయం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సూర్యదేవాలయానికి సంబంధించి రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావించింది. రాష్ట్ర పండుగగా గుర్తించి ప్రత్యేక నిధులను కేటాయించింది. బుల్లితెర నటులతో భారీ ఈవెంట్ నిర్వహించింది. ఈ క్రమంలోనే సింగర్ మంగ్లీ ఓ ఈవెంట్ కు హాజరయ్యారు. పనిలో పనిగా సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. వీఐపీ హోదాలో స్వామివారి దర్శన భాగ్యం పొందారు. కానీ వైసీపీ కాంగ్రెస్ పార్టీ కోసం పాటలు పాడిన సింగర్ కు దర్శనం ఎలా కల్పిస్తారు అన్నది కూటమి పార్టీలు లేవనెత్తిన ప్రశ్న. కానీ ఆమె కూడా ఈ ఈ రాష్ట్ర పౌరురాలు అని విషయం మర్చిపోయారు టిడిపి కూటమి శ్రేణులు. ఆమె దర్శనం చేసుకోవడం తప్ప? వేలాదిగా పాటలు పాడిన ఆమె సెలబ్రిటీ కాదా? ఆమె వైసీపీ కోసం పాటలు పాడడం తప్ప? ఇప్పుడు ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కూటమి నైజాన్ని తెలియజేస్తున్నాయి. తమకు వ్యతిరేకంగా అభిప్రాయాలు ఉంటే తప్పు. తమ అభిప్రాయాలను తెలియజేయడం తప్పు అన్నట్టు ఉంది కూటమి పరిస్థితి. మున్ముందు ఇదే పరిస్థితి కొనసాగితే కేవలం కూటమికి మద్దతు తెలిపి.. కూటమికి అనుకూలంగా వ్యాఖ్యానాలు చేస్తే గాని ఏపీలో ఉండనివ్వని పరిస్థితి. ఇంతకంటే ప్రజాస్వామ్య ఖునీ ఎలా ఉంటుందో వారికే తెలియాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!