Tuesday, April 22, 2025

ఏపీలో ఫ్యాక్షన్ విష సంస్కృతి!

- Advertisement -

ఏపీలో కూటమి నేతలు శ్రీరంగనీతులు చెబుతుంటారు. తాము చేస్తే లోక కళ్యాణం.. ఎదుట వారు చేస్తే వ్యభిచారం అన్నట్టు ఉంటుంది వారి వ్యవహార శైలి. గత ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పై విషప్రచారం చేయడంలో వారు సక్సెస్ అయ్యారు. చేసింది చెప్పుకోవడంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఫెయిల్ అయ్యారు. ఫలితంగా అధికారం తారుమారు అయింది. అయితే ఇప్పటికీ అదే తరహా విష ప్రచారంతో ఏడాది పాటు కాలం వెళ్లదీసింది కూటమి.

రాయలసీమలో మళ్లీ ఫ్యాక్షన్ హత్యలు ప్రారంభం అయ్యాయి. సుదీర్ఘ విరామం తర్వాత కూటమి ప్రభుత్వం ఫ్యాక్షన్ హత్యలకు ఆజ్యం పోసింది. రాయలసీమ వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా హత్యలు జరుగుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ శ్రేణులపై దాడులు పెరుగుతున్నాయి. కూటమి నేతలు దగ్గరుండి దాడులు చేయిస్తున్నారు. అయితే ఇంత జరుగుతున్న పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాయలసీమలో ఫ్యాక్షన్ హత్యలు తగ్గాయి. స్వతహాగా ఒక డాక్టర్ అయినా రాజశేఖర్ రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాలకు బాధితుడే. పైగా ఇవే ఫ్యాక్షన్ హత్యల్లో భాగంగా తన తండ్రిని కోల్పోయారు. అందుకే ఒక మంచి ఉద్దేశంతో ఫ్యాక్షన్ హత్యలపై ఉక్కు పాదం మోపారు. రాయలసీమలో రాజకీయ పునరేకికరణకు తన వంతు పాత్ర పోషించారు.

2004లో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు రాజశేఖర్ రెడ్డి. అప్పటికే ఆయనపై ఫ్యాక్షన్ ముద్ర ఉంది. రాయలసీమకు ప్రమాదం ఏర్పడబోతోందని ప్రచారం చేశారు ప్రత్యర్థులు. కానీ రాజశేఖర్ రెడ్డి అటువంటి ప్రయత్నం చేయలేదు. చాలా నిబద్దతతో పాలన అందించారు. రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలను కూకటి వేళ్ళతో పెకిలించారు. పోలీస్ యంత్రాంగానికి స్వేచ్ఛ ఇచ్చారు. అదే సమయంలో విపక్ష నేతలకు సైతం భరోసా కల్పించారు. నాడే వైయస్ రాజశేఖర్ రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహించి ఉంటే టిడిపి శ్రేణులు మిగిలేవా?

అయితే జగన్మోహన్ రెడ్డి పై కూడా ఫ్యాక్షన్ ముద్ర వేయడంలో ఎల్లో మీడియాతో పాటు ప్రత్యర్థి టిడిపి వర్గం కూడా సక్సెస్ అయింది. కానీ అటువంటి ముద్ర లేకుండా గత ఐదేళ్లలో పాలన అందించారు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ ఫ్యాక్షన్ ఛాయలు పడకుండా ప్రభుత్వాన్ని ముందుకు నడపడంలో సక్సెస్ అయ్యారు. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతోంది. అప్పుడే ఫ్యాక్షన్ హత్యలు, దాడులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

అయితే గత కొన్నేళ్లుగా రాయలసీమలో ఫ్యాక్షన్ రాజకీయాలు లేవు. ఫ్యాక్షన్ సంస్కృతి కూడా తగ్గుముఖం పట్టింది. కానీ మళ్లీ ఇటీవల పరిణామాలు చూస్తుంటే మాత్రం ప్రకంపనలు రేపుతోంది. ఇళ్లలోకి వెళ్లి మరి దాడులు చేస్తున్నారు. దాడులకు తెగబడుతున్నారు. హత్యలు చేస్తున్నారు. దీనిని నియంత్రించకపోతే రాయలసీమ రావణ కాష్టం కావడం ఖాయం. అదే జరిగితే చరిత్రలో చంద్రబాబు దోషిగా నిలబడడం ఖాయం.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!