Tuesday, April 22, 2025

కమ్మ సామాజిక వర్గంలో అలజడి.. కూటమి ప్రభుత్వంపై అసంతృప్తి!

- Advertisement -

కమ్మ సామాజిక వర్గం నేతలు టిడిపి పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కూటమి అధికారంలోకి వచ్చింది మొదలు కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసింది. వల్లభనేని వంశీ, పోసాని కృష్ణ మురళి, కొడాలి నాని.. ఇలా ఆ సామాజిక వర్గం నేతలనే వెంటాడింది. ఒకవైపు వల్లభనేని వంశీ మోహన్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండడం.. కొడాలి నాని ఆసుపత్రి పాలు కావడంపై కమ్మ సామాజిక వర్గంలో బలమైన చర్చ ప్రారంభం అయింది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దూకుడు కలిగిన ఇతర సామాజిక వర్గ నేతలను విడిచిపెట్టి.. కమ్మ సామాజిక వర్గం నాయకుల పైనే టార్గెట్ చేయడం ఏమిటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశంతో పాటు జనసేనలో చేరికలు పెరిగాయి. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దూకుడు కలిగిన నేతలు సైతం ఆ రెండు పార్టీల్లో చేరగలిగారు. అప్పట్లో టిడిపి శ్రేణులను ఇబ్బంది పెట్టిన వారికి సైతం కూటమి పార్టీల్లో చోటు దక్కింది. అయితే అది కేవలం కాపు సామాజిక వర్గం నేతలకే ప్రాధాన్యం ఇవ్వడం మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు కమ్మ సామాజిక వర్గం నాయకులు.

కాపు సామాజిక వర్గానికి చెందిన ఆళ్ల నాని టిడిపిలో చేరారు. ఆయన తీరుతో తాము తీవ్ర ఇబ్బందులు పడ్డామని టిడిపి శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేసిన చేర్చుకున్నారు. మరో మాజీ మంత్రి జోగి రమేష్ ను సైతం చేర్చుకునేందుకు సిద్ధపడ్డారు.

విశాఖలో అవంతి శ్రీనివాసరావు మంత్రిగా ఉండేటప్పుడు చాలామంది టీడీపీ నేతలు ఇబ్బంది పడ్డారు. ఆయన తీరుతో చాలా నష్టపోయారు కూడా. అటువంటి వ్యక్తిని సైతం టిడిపిలో చేర్చుకునేందుకు సిద్ధపడుతుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే కేవలం కాపు సామాజిక వర్గం నేతలను మాత్రమే చేర్చుకోవడం విశేషం.

అయితే ఇప్పుడు కొడాలి నాని ఆసుపత్రి పాలు కావడంతో కమ్మ సామాజిక వర్గంలో ఆయనపై ఒక రకమైన సానుభూతి కనిపిస్తోంది. కేసులతో ఒత్తిడి చేయడం వల్లే ఆయన గుండెపోటుకు గురయ్యారు అన్నది కమ్మ సామాజిక వర్గంలో వినిపిస్తున్న మాట.

పోసాని కృష్ణ మురళి సైతం కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన సైతం తనకు ఈ రాజకీయాలు వద్దు.. ఇకనుంచి రాజకీయాలు మాట్లాడను అంటూ అస్త్ర సన్యాసం చేశారు. అయినా సరే ఆయనకు కేసులతో వెంటాడారు. 26 రోజులపాటు కస్టడీల మీద కస్టడీలు కొనసాగిస్తూ రిమాండ్లో ఉంచగలిగారు. తనకు అనారోగ్యమని ఆయన వేడుకున్న కనికరించలేదు.

ఇక వల్లభనేని వంశీ మోహన్ పరిస్థితి చెప్పనవసరం లేదు. ఆయనపై ఇంకా కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పుడు విడిచి పెడతారో కూడా తెలియదు. ఆయన కోసం కుటుంబ సభ్యులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ పరిణామాలను గమనిస్తున్న కమ్మ సామాజిక వర్గంలో ఒక రకమైన అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

కూటమి 10 నెలల పాలనలో బాధిత వర్గంగా కమ్మ సామాజిక వర్గం మిగలడాన్ని ఆ సామాజిక వర్గం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. వీరు తప్పు చేశారు సరే.. మరి తప్పు చేసిన మిగతా సామాజిక వర్గం నేతల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏరి కోరి టిడిపి ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే తామే బాధిత వర్గంగా మారిపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!